27.7 C
Hyderabad
March 29, 2024 02: 25 AM
Slider నెల్లూరు

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

#mekapatichandrasekharareddy

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తనకు ఇచ్చిన కోడ్ ప్రకారం  వైసిపి అభ్యర్థికే ఓటు వేశానని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ్యుల కోట శాసనమండలి ఎన్నికలలో ముమ్మాటికి నేను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు… నాకు మరోసారి శాసనసభ్యుడి టికెట్ రాకుండా ఉండాలన్న దురుద్దేశంతోనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.. కొంతమంది వ్యక్తులు నాపై కక్ష సాధింపు చర్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాడీలు మోస్తున్నారు…రానున్న ఎన్నికల్లో నాకు శాసనసభ్యుడు టికెట్ ఇవ్వనని.. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం జరిగింది….ఎమ్మెల్సీ నాకు ఇష్టం లేకపోవడంతో నేను దానిని తిరస్కరించా.. శాసనసభ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తా… ఉదయగిరి శాసనసభ్యుడిగా గెలిచేందుకు  నాకంటే సరైన వ్యక్తి నియోజకవర్గంలో ఎవరూ లేరు అని ఆయన అన్నారు.

ఆనాటిలో నాలుగేళ్లు అధికారం ఉన్నా..వదులుకొని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తిని నేను…రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు దఫాలు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో  రెండు దఫాలు  శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా…. నాకు వేరే పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం అసలే లేదు..నాకు జనసేన, టిడిపి నేతలతో సంబంధాలు కూడా లేవు…. నా మనసు గాయపడింది వాస్తవమే.. నియోజకవర్గ పరిశీలకులుగా చిల్లర వ్యక్తులను నియమించడమే అందుకు కారణం….మనసు గాయపడినంత మాత్రాన క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అంత నీచపు వ్యక్తిని నేను కాదు… నిజాలను నిగ్గు తేల్చేందుకు  ఎలాంటి చర్యలు చేపట్టిన నేను  సహకరించేందుకు సిద్ధంగా ఉంటా….కుటుంబ వ్యవహారాల విషయంలో  నా అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి  ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి పంపకాలు జరపలేదు…అని ఆయన అన్నారు.

Related posts

హీటేక్కిన మండపేట: లీలా… తోట వార్…

Satyam NEWS

ఘనంగా తెలంగాణా స్పీకర్ పోచారం జన్మదిన వేడుకలు

Satyam NEWS

కరోనా డ్యూటీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment