36.2 C
Hyderabad
April 25, 2024 22: 14 PM
Slider ప్రత్యేకం

ఎస్పీఎఫ్ పోలీస్ ఉద్యోగులను జోనల్ ఉద్యోగులుగా గుర్తించాలి

#dyCM

రాష్ట్రంలోని ఉద్యోగులను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ ఉద్యోగులుగా విభజిస్తున్నారని, పోలీస్ శాఖలోని ఉద్యోగులయిన,సివిల్,ఏఆర్,ఫైర్ ఉద్యోగులను జోనల్ ఉద్యోగులుగా గుర్తించి కేవలం ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)పోలీసు ఉద్యోగులను మాత్రం జోనల్ ఉద్యోగులుగా గుర్తించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఉప ముఖ్యమంత్రి,&హోం మంత్రి మహమూద్ అలీని కలిసి ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పైచిలుకు ఎస్పీఎఫ్ ఉద్యోగులు కొనసాగుతున్నారు ఇదే శాఖలో పనిచేసే,సివిల్,ఏఆర్,ఫైర్   ఉద్యోగులను జోనల్ ఉద్యోగులుగా గుర్తిస్తు ఎస్పిఎఫ్ ఉద్యోగులను గుర్తించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు వీరిని కూడా జోనల్ ఉద్యోగులుగా గుర్తించాలని హోమంత్రిని డిమాండ్ చేశారు.

ఎస్పిఎఫ్ ఉద్యోగులు రాష్ట్రంలోగల వివిధ ప్రాజెక్టులు,ప్రభుత్వకట్టడాలు, అసెంబ్లీ,సెక్రటేరియట్ ల రక్షణలో విధులు నిర్వహిస్తున్నారు,వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మెరుగైన వైద్యం చేయించుకోడానికి హెల్త్ కార్డులులేవు,పిల్లల చదువులకు సరైన స్కూల్స్ లేవు,పోలీస్ శాఖలోని మిగతా  ఉద్యోగులతో సమాన వేతనాలు లేక మానసిక వేదన అనుభవిస్తున్నారని వీరిని కూడా పోలీస్ శాఖలోని మిగతా ఉద్యోగుల లాగే జోనల్ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సమక్షంలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఎస్పీఎఫ్  ఉద్యోగులను కూడా పోలీస్ శాఖలోని మిగతా ఉద్యోగుల లాగే జోనల్ పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని ఒప్పించి వీరి అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోని వీరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో యూత్&ఉమెన్ వెల్ఫేర్ ఫోరమ్ అధికారికసలహాదారు అబ్దుల్లా,ఎస్పిఎఫ్ ఉద్యోగులు నారాయణ,సత్య,మహేష్,గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Related posts

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం

Satyam NEWS

5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

గన్నవరం చేరుకున్న భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య

Satyam NEWS

Leave a Comment