39.2 C
Hyderabad
April 25, 2024 18: 59 PM
Slider వరంగల్

ములుగు జిల్లా సమస్యల పై వైయస్ షర్మిలకు వినతి పత్రం

#sharmila

ములుగు జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు గురించి  వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు శుక్రవారం వైయస్సార్ టీ ములుగు జిల్లా  పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాదులో ఆమెను కలిసి జిల్లాలో ఉన్న సమస్యలను వివరించారు. ములుగు జిల్లా లో పోడు భూములు సమస్యలు, వీటిలో ముఖ్యంగా  గిరిజన యూనివర్సిటీ, బిల్ట్ పరిశ్రమ మూతబడి ఉండడం , జిల్లాలో బస్సు డిపో లేకపోవడం వల్ల ప్రజల ఇబ్బందుల గురించి వినతి లో పేర్కొన్నారు.

దీనికి  స్పందించి ఆమె మాట్లాడుతూ త్వరలోనే ములుగు జిల్లా పర్యటిస్తానని హామీ  ఇచ్చినట్లు వారు తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు శాసనసభలో సగ భాగం అవకాశం కల్పిస్తామని, ప్రతి గడపగడపకు పాదయాత్ర ద్వారా అందరి కలుస్తారని అన్నారని నాయకులు  తెలిపారు.

ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, ధారావత్ ని దేవా నాయక్ ఉమ్మడి జిల్లాల సన్నాహక కమిటీ నెంబర్ బంజారా శ్యాం ప్రసాద్  తదితరులు ఉన్నారు.

Related posts

చిలకలూరిపేట తహసీల్దార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన సుజాత

Satyam NEWS

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

Bhavani

నియంత పాలన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

Satyam NEWS

Leave a Comment