40.2 C
Hyderabad
April 19, 2024 17: 19 PM
Slider విజయనగరం

కలెక్ట‌ర్కు మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు

Men of Excellence

ఏపీలోని విద్యల నగరంగా పేరొందిన జిల్లా సంగీతంలో ఎందరో నిష్ణాతులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిద్దిన జి‌ల్లాకు కలెక్టర్ గా ప్రజల ఆదరాభిమానాలను జిల్లా అధికారులు మన్నలను పొంది ప్రభుత్వ కార్యకలాపా‌ను సమర్ధవంతంగా నిర్వహించిన డాక్టర్ హరిజవహర్ లాల్ కు ‘మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ ల‌భించింది. ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన ఢిల్లీకి చెందిన ఇండియ‌న్ ఎచీవ‌ర్స్ ఫోర‌మ్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క జాతీయ‌ పుర‌స్కారానికి ఎంపిక చేసింది.

దేశంలో వివిధ రంగాల్లో సుదీర్ఘ‌కాలంపాటు ఉత్త‌మ సేవ‌లందించిన వారిని గుర్తించి, ఇండియ‌న్ ఎచీవ‌ర్స్ ఫోర‌మ్ గ‌త 20 ఏళ్లుగా ఈ అవార్డుల‌ను బ‌హూక‌రిస్తోంది. ఇప్ప‌టికే జిల్లాకు జాతీయ‌, రాష్ట్ర స్థాయిలో ఎన్నోఅవార్డుల‌ను సాధించిపెట్టిన క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హర్ లాల్‌, మ‌రో ప్ర‌ముఖ పుర‌స్కారానికి ఎంపిక కావ‌డంతో, ఆయ‌న‌కు అభినంద‌న‌లు వెళ్లువెత్తుతున్నాయి.

డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా రావ‌డం జిల్లాకు వ‌రం అని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జే.సీ.కిషోర్‌కుమార్ కొని యాడారు. మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పుర‌స్కారానికి ఎంపికైన క‌లెక్ట‌ర్‌ను ప‌లువురు ఉన్న‌తాధికారులు, మీడియా, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, సిబ్బంది దుశ్శాలువతో స‌త్క‌రించి, పూల‌గుచ్ఛాల‌తో అభినందించారు.

ఈ సంద‌ర్భంగా జేసీ కిషోర్ మాట్లాడుతూ, మ‌న‌ క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌ జిల్లాను అన్నివిధాలా అభివృద్దివైపు న‌డిపిస్తూ, ఇప్ప‌టికే ప‌లు అవార్డుల‌ను సాధించిపెట్టార‌ని అన్నారు. జిల్లా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కింద‌ని ప్ర‌శంసించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు మాట్లాడుతూ ప్ర‌తి అంశంలోనూ జిల్లాను ఇత‌ర జిల్లాల‌కంటే ముందు ఉంచాల‌న్నత‌ప‌న క‌లెక్ట‌ర్‌లో చూశాన‌ని అన్నారు. ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌కు, ప్ర‌జా సంక్షేమానికి ఆయ‌న ఎల్ల‌ప్పుడూ ముందుంటార‌ని చెప్పారు. కారుణ్య నియామ‌కాల్లో గానీ, స‌చివాల‌య ఉద్యోగాల భ‌ర్తీలో గానీ, ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీలో గానీ క‌లెక్ట‌ర్ చూపించిన చొర‌వ ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల అధికారి డి.ర‌మేష్ మాట్లాడుతూ త‌న అపార అనుభ‌వంతో జిల్లాను క‌లెక్ట‌ర్ అన్ని విధాలా ముందుకు న‌డిపిస్తున్నార‌ని కొనియాడారు. ప్ర‌ణాళికా బ‌ద్ద‌మైన కృషి, సానుకూల దృక్ప‌థం, అంద‌రినీ క‌లుపుకొని జిల్లాను క‌లెక్ట‌ర్‌ ముందుకు న‌డుస్తుండ‌టం వ‌ల్ల ఎన్నో పుర‌స్కారాలు ల‌భిస్తున్నాయ‌ని చెప్పారు.

క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ విలువ‌ల‌కు నిలువ‌ట‌ద్ద‌మ‌ని కెఆర్ఆర్‌సి ఉప క‌లెక్ట‌ర్ కెబిటి సుంద‌రి పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ విజ‌యాల‌కు ప్ర‌తిరూపంగా మారార‌ని, జిల్లా విప‌త్తుల నివార‌ణాధికారి బి.ప‌ద్మావ‌తి కొనియాడారు. జిల్లాకు క‌లెక్ట‌ర్ చేసిన సేవ‌లు ఎన్న‌టికీ మ‌రువ‌లేనివ‌ని, ఆయ‌న పాల‌నాద‌క్ష‌త కార‌ణంగానే అవార్డులు వ‌రిస్తున్నాయ‌ని సీపీఓ జె.విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌శంసించారు.

సానుకూల దృక్ఫ‌థం, స‌మిష్టి కృషే త‌న విజ‌యానికి కార‌ణ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ పేర్కొన్నారు. త‌న‌కు మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు రావ‌డం ప‌ట్ల ఆయ‌న స్పందిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. సృజ‌నాత్మ‌కంగా ప‌నిచేసేందుకు అవాకాశం రావ‌డం కూడా ఒక వ‌ర‌మ‌ని, దానిని విజ‌య‌న‌గ‌రం జిల్లా త‌న‌కు క‌ల్పించింద‌ని చెప్పారు. మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేసుకుపోవ‌డం, త‌న‌కు జిల్లా యంత్రాంగం నుంచి కూడా సంపూర్ణ స‌హ‌కారం అంద‌డం త‌న విజ‌యాల‌కు కార‌ణాల‌ని పేర్కొన్నారు. తాను ఎన్న‌డూ అవార్డుల‌ను ఆశించ‌లేద‌ని, అంకిత‌భావం, చిత్త‌శుద్దితో ప్ర‌ణాళికాబ్దంగా ప‌నిచేయ‌డం వ‌ల్లే, అవార్డులు వాతంట‌త అవే వ‌స్తున్నాయ‌ని చెప్పారు. మేన్ఆఫ్ ఎక్స్‌లెన్స్ గా త‌న‌ను గుర్తించ‌డ‌మే కాకుండా, విజ‌య‌న‌గ‌రం జిల్లా పేరును కూడా ఎన్ఐఐఆర్‌డి రికార్డుల్లో చిర‌స్థాయిగా నిలప‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని అన్నారు.

ప్ర‌తీ క‌లెక్ట‌ర్ జిల్లా అభివృద్దిపై త‌న‌దైన ముద్ర వేయాల‌ని, ఇత‌ర జిల్లాల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని సీఎం జగన్ త‌ర‌చూ చెప్పే మాట‌లు, ప్రోత్సాహం కార‌ణంగా, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు న‌డుస్తున్నాన‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ అన్నారు.

Related posts

పట్టిసీమ ను విమర్శించిన వారే వాడుతున్నారు…

Bhavani

చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి

Bhavani

నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు నేర‌స్థులు కారా

Sub Editor

Leave a Comment