35.2 C
Hyderabad
May 29, 2023 20: 28 PM
Slider ప్రత్యేకం

ఏకమవుతున్న పార్టీలు

#Merging parties

పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ కొన్ని పార్టీల మధ్య విభజనకు, మరికొన్ని పార్టీల మధ్య ఐక్యతకు దారితీసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సహా 19 పార్టీలు ఒక్కటయ్యాయి. కానీ అందులో బీఆర్ఎస్ లేదు. దీంతో ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 28న జరిగే పార్లమెంటు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ హాజరవుతుందా? లేక బహిష్కరిస్తుందా?..

అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.ఒకరోజు ముందు మాత్రమే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అధినేత వెల్లడించే నిర్ణయానికి అనుగుణంగా హాజరుకావడంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ ఎంపీలు వ్యాఖ్యానించారు. చివరి నిమిషం వరకూ నిర్ణయాన్ని ప్రకటించకుండా ఉండడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నది.

తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలన్నీ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని నిర్ణయించాయి. ఈ పార్టీలన్నీ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్నవే అనే అభిప్రాయం ఉన్నది. బీఆర్ఎస్ మాత్రమే అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెందకుండా ఏకాకిగా మిగిలింది.అదానీపై హిండెన్‌బర్గ్ రిపోర్టు

విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకట్టిన బీఆర్ఎస్ ఈసారి పార్లమెంటు ప్రారంభోత్సవం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికర చర్చకు దారితీసి, సరిగ్గా బీఆర్ఎస్ కోరుకుంటున్నది కూడా ఇలాంటి చర్చ జరగాలనే. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గైర్హాజరు కావాలనే నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నట్లు గులాబీ వర్గాల సమాచారం.

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరగనున్నది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నందున ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి. గతేడాది ఆగస్టు 27న జరిగిన ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులెవ్వరూ హాజరుకాలేదు.రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని, రాష్ట్రాల అధికారాలను హస్తగతం

చేసుకుంటున్నదని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని.. ఇలాంటి కొన్ని అంశాలను ప్రస్తావించిన కేసీఆర్, నీతి ఆయోగ్ నిర్వహించే సమావేశాలతో ఫలితమేమీ లేదని, నిరసనగానే బహిష్కరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేశారు.ఈసారి కూడా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం విషయంలో ఇదే వైఖరిని అవలంబించే అవకాశమున్నది.

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం తరహాలోనే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా బీఆర్ఎస్ దూరంగానే ఉండవచ్చన్న వార్తలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ రెండు సమావేశాల్లో పాల్గొనడం ద్వారా జాతీయ స్థాయిలోనే చర్చకు ఆస్కారం కల్పించనట్లవుతుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది.

Related posts

తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం దిశగా అడుగులు

Satyam NEWS

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

Sub Editor

మినీ ట్యాంక్ బండ్ లో శవమైకనిపించిన వివాహిత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!