36.2 C
Hyderabad
April 24, 2024 19: 46 PM
Slider మహబూబ్ నగర్

విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్మన్

#Kalwakurthy Merit Students

ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నాగర్ కర్నూర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎమ్ జూనియర్  కళాశాల విద్యార్థులు విజయాఢంకా మోగించారు. ఇంటర్ ప్రధమ సంవత్సరం ఎంపిసిలో 470 మార్కులకు 444 మార్కులు సాధించి టౌన్ పస్ట్ గా పి. హరీష్ ,తర్నికల్ నిలిచారు.

సిఈసి లో 500 లకు 450 మార్కులు పొంది టౌన్ రెండవ స్దానంలో సోఫియ ,ఊర్కోండపేట నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బైపిసిలో 1000 మార్కులకు 953 మార్కులు సాధించి టౌన్ పస్ట్ గా బి.చరణ్ కుమార్ మల్లెల తీర్థం నిలిచాడు.

వీరితో పాటు బైపిసి లో 348 మార్కులతో పి. మహేష్ ,లింగారెడ్డి పల్లి , బి . అనూష సిలార్ పల్లి , ఎంపిసిలో 918 మార్కులతో వి.తరుణ్ కుమార్ , కొండరెడ్డిపల్లి , సిఈసి లో కె. కీర్తన 873 మార్కులు పొంది కళాశాలలో పధ్రమ స్దానంలో నిలిచారు. ఈ విద్యార్థులను మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం అభినందించారు.

విద్యార్థులకు పూలమొక్కలను అందించి ,శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల స్దాయి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోని లక్ష్య సాధన దిశగా ప్రయాణించి జీవితంలో రాణించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ , కళాశాల ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ రెడ్డి ,డైరెక్టర్లు రాజు ,శంకరయ్య , సత్యం ,ప్రభాకర్ గౌడ్ ,యాదగిరి గౌడ్ ,దేవరాజు ,అధ్యాపకులు శ్రీనివాస్ రావు ,విజయ్ ,ఆంజనేయులు,వెంకటయ్య,రాజేష్ ,రాజు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Related posts

సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది: మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని దిశగా అడుగులు

Satyam NEWS

దిండుతో అదిమి పెట్టి వృద్ధ దంపతుల దారుణ హత్య

Satyam NEWS

ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే

Satyam NEWS

Leave a Comment