35.2 C
Hyderabad
April 20, 2024 18: 41 PM
Slider ముఖ్యంశాలు

పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలి

#Minister Harishrao

ఈ  భూమండలం లో అన్నింటి కంటే విలువైనది ప్రకృతి , జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యవరణం పై ఆధారపడి ఉందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి  హరీష్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశాన్ని ఇచ్చారు. మొక్కలు  లేక పోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకం అవుతుంది అని, అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ప్రకృతి పై దృష్టి  పెడుతున్నాయని హరీష్ రావు తెలిపారు. 

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, మొక్కలను సంరక్షించాలి అని ఆయన సందేశం ఇచ్చారు. ప్రకృతి సంరక్షణ మన అందరి బాధ్యత… 130 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం చెట్లను నాటి కాపాడు కోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదన్నారు. సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంల చేపట్టాలి… చెట్లను నాటడం వాటిని సంరక్షించడం  ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు,క్యాన్సర్ లాంటి  వ్యాధుల బారిన పడుతున్నామన్నారు.

చెట్లను పెంచడం..అడవులను సంరక్షించడం.. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు.. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని.. రాబోయే రోజుల్లో  ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి , పర్యావరణ పై బోధించాలని ప్రతి ఒక్క విద్యార్థి తో మొక్క నాటించాలని పర్యావరణ దినోత్సవం సందర్భంగా  చెప్పారు

Related posts

రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో కొంత ఊరట

Satyam NEWS

సబ్ సెంటర్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

మాచర్లలో హై టెన్షన్: బ్రహ్మానందరెడ్డి అరెస్ట్ కు కుట్ర

Satyam NEWS

Leave a Comment