ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో ఒక యువతి మరణించింది. ఊహించని ఈ దుర్ఘటన అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగింది. ఈ ప్రమాదంలో 24 సంవత్సరాల మౌనిక తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. మెట్రో స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడి మీద పడటంతో మౌనిక తలకు బలమైన గాయాలయ్యాయి. శకలాలు పడడంతో మౌనిక పై అక్కడికక్కడే మృతి చెందింది. బయట వర్షం పడుతున్న సమయములో మెట్ల వద్ద మౌనిక నిలబడి ఉన్నది. అదే ఆమె పాలిట శాపం అయింది. అశ్రద్ధతో కట్టిన పైకప్పు ఊడి పెచ్చులు కింద పడ్డాయి. దురదృష్టం మౌనికను పెచ్చుల రూపంలో వెంటాడింది. ఈ కేసుపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతికి తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఎల్ అండ్ టిని ఆదేశిస్తామని మెట్రో రైల్ ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు.
previous post
next post