28.7 C
Hyderabad
April 20, 2024 08: 47 AM
Slider మెదక్

మత్య్సకారుల శ్రమను దోచుకుంటున్న మధ్య దళారులు

#fishermen

మత్య్సకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు ఇవ్వడం మంచి ఉద్దేశ్యమే అయినా దళారుల వల్ల ఆ పథకం పక్కదారి పడుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం ఆరోపించింది.

రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు. ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం టెండర్ వేస్తే ఆ టెండరు దక్కిన కాంట్రాక్టర్ నాశిరకం చేపపిల్లలు తక్కువ ధరకు కొనుగోలు చేసి చెరువుల్లో పోస్తే ఆరు నెలల వరకు రెండువంద గ్రాములు కూడ పెరగడం లేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మత్య్సకారుల సంక్షేమం కోరుకుంటే టెండరు డబ్బులు నేరుగా గ్రామాల సొసైటీ వాళ్ళ బ్యాంకు అకౌంట్ లో వేసి చేపపిల్లలు తెచ్చుకునే బాధ్యతను మత్య్సకారులకే ఇవ్వాలని అన్నారు.

కాంట్రాక్టర్లు పంపిణీ చేసిన చేప పిల్లలతో జరిగిన నష్టం వందల కోట్లని వారి చేతిలో ప్రభుత్వం మోసపోవద్దని హితవు పలికారు.

మత్య్సకారుల బతుకులు మరాలంటే ప్రభుత్వం విధానంలో మార్పు రావాలని నాశిరకం చేప పిల్లలలో మత్య్సకారులను రోడ్డున పడేసి రోడ్డెకేటట్లు చేయద్దని జంగిటి అన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణరావు పేట మండల అధ్యక్షుడు బోయిని కమలాకర్, ఉపాధ్యక్షులు పొన్నాల స్వామి, కొత్త బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మల్టీ నేషనల్ ఛీటింగ్: అమెజాన్ కు పంగనామాలు

Satyam NEWS

మరో లాక్ డౌన్ తప్పదు…సీసీఎంబి డైరెక్టర్ సంచలన వార్త!

Sub Editor

సిమ్ కార్డు అమ్మకందారులకు కేంద్ర హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment