39.2 C
Hyderabad
April 25, 2024 18: 39 PM
Slider నల్గొండ

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

#Roshapati

పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కుటుంబాలు కరోనా కారణంగా అల్లకల్లోలంగా మారాయని, కార్మికులకు 15 రోజులు సెలవు ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు. ఆయనతో బాటు టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకుడు సలిగంటి జానయ్య, రైస్ మిల్ యాజమాన్యాన్ని  కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు కార్యాలయం వద్ద రైస్ మిల్లు డ్రైవర్ గేట్ మీటింగ్ లో పాల్గొన్న వారు మాట్లాడుతూ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో ఇంటికే పరిమితం అవ్వటానికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని అన్నారు. కరోనా సోకిన కార్మికులకు ప్రభుత్వ పరంగా, యాజమాన్యం పరంగా, ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

అనంతరం రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష్య,కార్యదర్శులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు,సింగరి కొండ శ్రీనివాస రావుకి వినతి పత్రం సమర్పించారు.  యాజమాన్యం రెండు మూడు రోజుల్లో సెలవుల  విషయం కమిటీ సభ్యులతో చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు కె. వెంకన్న, కనకయ్య, చింతకాయల పర్వతాలు, రామయ్య, కోటయ్య, టిఆర్ఎస్ కెవి నాయకులు తమ్మిశెట్టి వెంకన్న, చింతకాయల మల్లయ్య, సైదులు, ఎర్రయ్య, బ్రహ్మం, ఐ ఎన్ టి యు సి పోతనబోయిన రామ్మూర్తి, శ్రీను, కొండలు, నాగరాజు, బాలకృష్ణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Autocrat : ఉక్రెయిన్ పై రష్యా ఉగ్ర (వాదం) రూపం

Satyam NEWS

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు చర్చలు జరపాలి

Satyam NEWS

విఆర్వోలు ఫినిష్… నెక్ట్స్ ఎంఆర్వోలా?ఎంపిడివోలా? సబ్ రిజిస్ట్రార్ లా?

Satyam NEWS

Leave a Comment