38.2 C
Hyderabad
April 25, 2024 13: 55 PM
Slider ప్రత్యేకం

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

#Rice Mill functioning

వరి ధాన్యాన్ని బియ్యం గా మార్చుకునేందుకు రైస్ మిల్లులతో జాగ్రత్తగా ఉండకపోతే రైతన్నలు మోసపోవడం తప్పదు. వడ్లను బియ్యం గా మార్చేక్రమంలో క్వింటాలుకు రైతులకు ఎదురు 100  రూపాయల నుండి 120 రూపాయల వరకు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రైస్ మిల్లర్లకు  మాత్రమే ఇది సాధ్యం.

ఎవరైనా  పని చేసినప్పుడు డబ్బులు తీసుకుంటారు కానీ ఇక్కడ  పనిచేసి పెట్టి మరి ఎదురు ఇవ్వడం విచిత్రం ఏమిటంటే ఎలివేటర్ లో ఉన్న చిన్న చిన్న బకెట్ల ద్వారా మరొక ఎలివేటర్ కు వెళ్లే క్రమంలో ఎలివేటర్ కు ఉన్నా రంధ్రాల ద్వారా కింద ఉన్న గోతిలో  వడ్లు పడే విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు.

రైతుకు మేలు చేస్తున్నట్లు నటన

ఇలా రైతు కు తెలియకుండా రైతు ధాన్యం కొట్టేస్తారన్నమాట. ఏ వ్యాపారమైనా ప్రతిఫలం లేకుండా ఎవ్వరూ చేయరు అటువంటిది పట్టణంలోని రైస్ మిల్ యజమానులు వారి వద్దకు వడ్లు తెచ్చిన రైతుకు సేవ చేస్తున్నట్లు నటించి బియ్యం కాజేస్తున్నారు.

అదేవిధంగా ప్యాడి క్లీనర్ దగ్గర  మట్టి రావాల్సిన స్థానంలో వడ్లు వచ్చే విధంగా సర్దుబాటు చేస్తారు. ఇంకో అసలు మతలబు ఒక రైతు 10 బస్తాల వడ్లు తెచ్చిన ఆ రైతును మాటల్లో పెట్టి ఒక బస్తా ను పక్కనే ఉన్న యజమానికి సంబంధించిన వడ్ల సంచుల వరుసలో కలుపుకుంటూ ఉంటారు.

రైతుకు అనుమానం రాకుండా అక్కడ ఒక ఖాళీ బస్తా దర్శనమిస్తుంది. మొత్తం మీద రైతు తెచ్చిన బస్తాలకు 10 కాళీ బస్తాలు అక్కడ దర్శనమిస్తాయి. ఇదే తరహాలో రైతన్నను పలు విధాలుగా రైస్ మిల్లర్స్ రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు.

మిల్లర్ల మోసాలను ప్రభుత్వం కట్టడి చేయాలి

ఇటువంటి మోసాలు తెలియని అమాయకులైన రైతులు ఆరుగాలం కష్టపడి దేశానికి వెన్నుముక అని జై కిసాన్ అనే బిరుదు తప్పితే రైతులకు ఒరిగేది ఏమీ లేదు. రైతుబంధు ఇస్తున్నామని రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం  మానేసి ఇలాంటి దోపిడీలకు గురవుతున్న రైతన్నలను కాపాడాలి. అలా కాపాడుకోలేక పోతే  భవిష్యత్తు తరాలవారు ఒకప్పుడు ఈ దేశంలో  రైతు అనే వ్యక్తి ఉండేవాడు అని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఇటువంటి మోసాలకు పాల్పడే రైస్ మిల్లర్ల యజమానులపై కఠినంగా వ్యవహరించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related posts

రోడ్ ప్ర‌మాదల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మార్గం….!

Satyam NEWS

58, 59 జిఓ ల అమలలో వేగం పెంచాలి

Bhavani

మాదకద్రవ్యాల కేసులో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు

Bhavani

Leave a Comment