27.7 C
Hyderabad
April 24, 2024 08: 50 AM
Slider ముఖ్యంశాలు

ధరణి తో లక్షల కోట్ల కుంభకోణం

#Dharani

ధరణి తీసుకువచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో అత్యున్నత విలువైన భూములను పార్ట్ బి లో పెట్టి ప్రజలకు అర్థమయ్యేలోపు ప్రభుత్వ పెద్దలు చాలా నిశ్శబ్దంగా హాం ఫట్ చేస్తున్నారు.

ధరణి ద్వారా భూమిపై హక్కు కోల్పోయామని ఆదిలాబాద్ నుంచి జడ్చర్ల వరకు తాను నిర్వహించిన పాదయాత్రలో వచ్చిన ప్రజల విజ్ఞాపనలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యము అని ఆయన అన్నారు.

మిషన్ భగీరథ, కాలేశ్వరం కమిషన్ల జరిగిన అవినీతి గురించి ఇన్నాళ్లు ప్రజలు చర్చించుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అతిపెద్ద భూకుంభకోణం ధరణీ ద్వారా తెలంగాణలో జరుగుతున్నది. ఈ భూ కుంభకోణం రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అని ఆయన తెలిపారు.

భూ కుంభకోణం ద్వారా డబ్బులు పోగు చేసుకున్నారు కాబట్టే.. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే విపక్ష అభ్యర్థులకు అయ్యే ఖర్చు భరించే స్థాయికి కేసిఆర్ ఎదిగారు. బిఆర్ఎస్ పరిపాలనలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది.

బలహీన వర్గాల ప్రజలు కులవృత్తులు చేసుకోవడానికి కావలసిన సహాయం చేయడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కేటాయించిన నిధులు ఆరు శాతం మాత్రమే అని ఆయన అన్నారు.

బీసీల పట్ల వివక్ష చూపుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం పైన బలహీన వర్గాలు తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. వడ్డీ లేని రుణాలు పావలా రుణాలు ఇవ్వకుండా మహిళలను వంచన చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి డ్వాక్రా మహిళలు సంసిద్ధంగా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను పునర్నిర్మానం చేస్తున్న బిఆర్ఎస్ కు చరమ గీతం పాడటానికి ప్రజలు సమయతమవుతున్నారు. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి ఆచరించేవారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చునని ఆయన అన్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలామంది వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు చాలామంది తమతో టచ్ లో ఉన్నారు. వారి పేర్లు బయట పెడితే వారిపైన అధికార రాజకీయపరమైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి గోప్యంగా ఉంచుతున్నాము. దేశ సంపదను దోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న బిజెపికి కర్ణాటక ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు

కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణలో పఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ను గెలిపించుకోవడానికి ప్రజలు సమయాత్తమయ్యారు. ప్రధాని మోడీది తుగ్లక్ పాలన. ఏ నోట్లు ఎందుకు రద్దు చేస్తున్నారో.‌.. ఎందుకు కొత్త నోట్లను తీసుకొస్తున్నారో తెలియని పరిస్థితి.

దొంగ నోట్లు, నల్లధనం బయటికి తీసుకొస్తానని ప్రకటించి నోట్ల రద్దు చేసి నాలుగేళ్లు అవుతున్న మోడీ ఇప్పటివరకు వాటి గురించి ప్రకటన చేయలేదు దేశ ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలం చేయడంలో బహుళ జాతి కంపెనీలు చేస్తున్న కుట్రలో భాగంగానే ప్రధాని మోడీ 2వేల నోట్లను రద్దు చేశారని ఆయన అన్నారు.

Related posts

మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘ నేతలు

Satyam NEWS

తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

Murali Krishna

Leave a Comment