32.7 C
Hyderabad
March 29, 2024 10: 36 AM
Slider గుంటూరు

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

#MIMNarasaraopet

మైనారిటీ లపై హత్యలు, హత్యాచారాలు, దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నదని ఎంఐఎం పార్టీ ఆరోపించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చపరి గ్రామం లో ప్రేమ పేరు తో మోసం చేసి ఒక యువతిపై అత్యాచారం, అత్యా చేసిన వారిని వెంటనే ఎంకౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది.

నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ రాష్ట్రం లో 2014 నుంచి నేటి వరకు ముస్లిం మైనారిటీ లపై దాడులు జరుగుతూనే వున్నాయని అన్నారు.

అప్పటి తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది అని అనుకునే వారమని, అలా అనుకుని వైస్సార్ సీపీ కి పట్టం కడితే ఈరోజు ఈ ప్రభుత్వం లో కూడా ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

ముఖ్యమంత్రిగా జగన్ అయిన తర్వాత ముస్లింలపై మరి ఎక్కువ గా దాడులు, అత్యాచారాలు, హత్య లు అధికమైనాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ లో దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కెసిఆర్ ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసిందని ఆయన అన్నారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చపరి గ్రామంలో జరిగిన సంఘటన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు కరీముల్లా తో బాటు సుభాని మాబుషరీఫ్, కాలేషా, జానీ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భత్యాల పోలీసులు,అధికారులను విమర్శిస్తే సహించేది లేదు

Satyam NEWS

ఇస్రో కొత్త చీఫ్‌గా ఎస్ సోమనాథ్

Sub Editor

ప్రజా వినతులను పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment