40.2 C
Hyderabad
April 19, 2024 17: 02 PM
Slider గుంటూరు

లెక్చరర్లకు, టీచర్లకు గౌరవ వేతనం కోసం ఎంఐఎం దీక్ష

#MIM Mastan Vali

రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలి దీక్ష ప్రారంభించారు. ఈ రోజు నరసరావుపేట లోని పనస తోట లో మస్తాన్ వలి తన ఇంట్లో దీక్ష ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 9లక్షల  మంది  ప్రెవేటు టీచర్లు లెక్చర్లు  లాక్ డౌన్  కారణంగా గత  4నెలలుగా వేతనాలు లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రం లో అనేక మంది లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని,  ఇతర పనులు చేతకాక, అర్ధాకలితో అల్లమటిస్తున్న కుటుంబాలు చాలా వున్నాయని ఆయన అన్నారు.

తన పాదయాత్ర లో అనేక మందిని కలిసి సమస్యలు విని వాటి పరిష్కారం చేస్తామని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లెక్చరర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. వారికి గౌరవ వేతనం ఇచ్చి  న్యాయం చేయాలని కోరుతున్నామని వారికి న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగుతాయని మస్తాన్ వలి తెలిపారు.

ఈ దీక్ష కు మద్దతుగా రాష్ట్ర మాలమహానాడు మహిళా కన్వీనర్ మల్లెల అనిలా, ఎంఐఎం పార్టీ నాయకులు ధరియ్య వలి జిక్రియా, మసూద్, బుడే తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు చర్చలు జరపాలి

Satyam NEWS

లిక్కర్ మఠాష్: గుడుంబా స్థావరాలపై దాడులు

Satyam NEWS

శ్రీరామ జన్మభూమి కి సంఘీభావంగా దీపావళి

Satyam NEWS

Leave a Comment