28.7 C
Hyderabad
April 24, 2024 06: 24 AM
Slider జాతీయం

హిందూస్థాన్ అనడానికి నిరాకరించిన మజ్లీస్ ఎమ్మెల్యే

#National Flag

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘‘హిందూస్థాన్’’ అని చెప్పడానికి తీవ్ర అభ్యంతరం చెప్పాడు అతను. హిందూస్థాన్ తీసేయాలని భారత్ అని చేర్చాలని అతను పట్టుపట్టాడు.

తాను హిందూస్థాన్ అనే పదాన్ని పలికేది లేదని మంకుపట్టు పట్టి కూర్చొన్నాడు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ అనే ఈ వ్యక్తి చేసిన హంగామాకు బీహార్ అసెంబ్లీ విస్తుపోయింది. చివరకు ప్రోటెం స్పీకర్ గా ఉన్న జితిన్ రామ్ మాంఝీ అతడి డిమాండ్ కు అంగీకరించి భారత్ అనే పదాన్ని వాడేందుకు అనుమతిచ్చారు.

ప్రమాణ స్వీకారం తర్వాత మీడియా అతడిని ప్రశ్నలతో ముంచెత్తింది. హిందూస్తాన్ అని అనడానికి ఎందుకు అభ్యంతరం అని మీడియా ప్రశ్నించింది. రాజ్యాంగంలో హిందూస్థాన్ అని లేదని, భారత్ అని ఉందని అందుకే తాను ప్రమాణ స్వీకారం హిందూస్థాన్ అని చేయలేదని అక్తరుల్ చెప్పాడు.

Related posts

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Satyam NEWS

Analysis :మాయదారి చైనా మన దారికి వచ్చేనా?

Satyam NEWS

ఒక వైపు యుద్ధం… మరో వైపు స్నేహ హస్తం

Satyam NEWS

Leave a Comment