30.7 C
Hyderabad
April 24, 2024 00: 55 AM
Slider నల్గొండ

11వ PRC ప్రకారం కనీస వేతనం రూ.24000 ఇవ్వాలి

CITU

మున్సిపల్ వర్కర్స్ నుండి గ్రామ పంచాయతీ కార్మికులను దేవుళ్ళు అని  కరోనా లాక్ డౌన్ కాలంలో పొగిడిన ముఖ్యమంత్రి కెసిఆర్ వీరికి వేతనాలు ఎందు పేంచలేదో చెప్పాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులతో రోషపతి మాట్లాడుతూ 11వ PRC ప్రకారం కనీస వేతనం 24000 రూపాయలు ఇవ్వాలని,  కోరారు.

రాష్ట్రంలో ఇతర ఉద్యోగులకు పెంచిన విధంగా మున్సిపల్ కార్మికులకు కూడా పెంచాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇంటి కిరాయి 12 నెలల ఎరియర్స్ ను నగదు రూపంలో చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముత్తమ్మ, దుర్గారావు, సైదులు, రవి, చంద్రకళ, కుమారి, రాంబాయి, దేవకరుణ, కాంతి, పుల్లయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలూ, నీకు కోపం వచ్చిందా?

Satyam NEWS

అమానుషం: శరణార్థులు ఉన్న స్కూలుపై రష్యా బాంబుల దాడి

Satyam NEWS

వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పరిమితం

Satyam NEWS

Leave a Comment