24.7 C
Hyderabad
March 26, 2025 09: 39 AM
Slider మెదక్

రుణమాఫీ పూర్తిగా జరగలేని ఒప్పుకున్న మంత్రి

#rajanarsimha

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే తానే ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. గ్రామంలో 350 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా 150 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని  ప్రకటించారు.

ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తో పాటు అనేక మంది మంత్రులు కూడా రుణమాఫీ మొత్తం జరిగిందని కుండబద్దలు కొట్టి చెప్పారు. కానీ మంత్రి దామోదర్ రాజ నరసింహ మాత్రం 50 శాతం మందికి జరిగిందని చెప్పి ప్రతిపక్షాల మాటలకు ఊతమిచ్చారు. ఈరోజు ఆందోల్ నియోజకవర్గంలోని నేరేడు గుంట గ్రామంలో గ్రామ సదస్సు జరిగింది. వైద్యశాఖ మంత్రి దామోద రాజనర్సింహ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. 

అయితే రైతు రుణమాఫీ అంశం రాగానే ప్రజల నుంచి రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ముందే ఊహించిన దామోదర్ రాజనర్సింహ తమ  ప్రభుత్వ తప్పిదాన్ని ముందే ఒప్పేసుకున్నారు. ఇంకా 50 శాతం మందికి రుణమాఫీ జరగలేదని చెప్పి ప్రజలను శాంతించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వ పథకాల్లో నిజమైన  లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని  చెప్పి వారిని  కూడా శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఆందోల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఈరోజు జరిగిన గ్రామసభలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసాయి. అనేక గ్రామసభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే తమ పేర్లను రాసుకుని లబ్ధిదారుల జాబితా తయారు చేశారని అధికారుల ముందు మండిపడ్డారు. ప్రతి గ్రామంలో కూడా పోలీసుల సహకారం లేనిది గ్రామసభలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సాక్షాత్తు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో తమ ఇష్టం వచ్చిన జాబితా సిద్ధం చేసుకుంటున్నారని అర్హులు కానప్పటికీ కాంగ్రెస్ నాయకుల పేర్లనే లబ్ధిదారుల లిస్ట్ తయారు చేశారని గ్రామసభలను నామమాత్రంగా నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related posts

ముస్లింలకు అనుకూలంగా మాట్లాడినా స్వర్గం దక్కదు

Satyam NEWS

అవినీతి పాలనకు చరమగీతం పాడాం

Satyam NEWS

కనీవినీ ఎరుగని రీతిలో సభ సక్సెస్ చేస్తాం

Satyam NEWS

Leave a Comment