ఏపీ రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ ల మధ్య వాడీ వేడిగా వాగ్యుద్ధం జరిగింది. విజయనగరం జిల్లా పరిషత్ హాలులో బుధవారం సర్వ సభ్య సమావేశం జేడ్పీ చైర్మన్ చిన్న శీను అధ్యక్షతన జరిగింది. నీటి పారుదల ప్రాజెక్టుల పై విజయనగరం ఎంపీ కలిశెట్టి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనలు అధికారులను ప్రశ్నించారు. ఈ సమయంలో విదన కాస్త గాడి తప్పింది. మీ హాయాంలోనే జరిగిందని మంత్రి కొండపల్లి, ఏడు నెలల పాలనలో మీరేమి ఒరగబెట్టారంటూ జేడ్పీ చైర్మన్ ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో హాలు మొత్తం ఈ ఇద్దరి వాక్బాణాలతో దధ్ధరిల్లింది. దాదాపు అరగంట సేపు ఒకరి పాలనపై ఒకరు దూషించుకుంటూ పై చేయి సాధించే తపనతో అటు మంత్రి కొండపల్లి, ఇటు జేడ్పి చైర్మన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది
previous post
next post