31.2 C
Hyderabad
February 14, 2025 20: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్

పి.టి.ఐ.ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

Adimulapu Suresh

సమగ్ర శిక్ష లోని ఉద్యోగులకు వేతనాలు, వివిధ సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. పి.టి.ఐ.ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ షేక్.హాజి మలంగ్, జనరల్ సెక్రెటరీ కె.మహేష్ బాబు, ట్రెజరర్ కడప జిల్లా బద్వేలు చిన్న వెంకటయ్య, కడపజిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. ఐజయ్య నేడు ఆయనను అమరావతి లోని రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.

పి.టి.ఐ.ల సమస్యలైన క్రమబద్దీకరణ, వేతనాల పెంపుదల, పాఠశాల పూర్తి పనివేళలలో విధుల నిర్వాహణ, ఒకటవ తేదీ నాటికి ప్రతి జిల్లాలో పి.టి.ఐ.లు తదితర సమస్యలను వారు మంత్రికి వివరించారు. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ వేతనాల పెంపు విషయం,ఒకటవ తేదీన అందరికి వేతనాలు అందించే విషయం మరియు పనివేళల గురించి తాను స్వయంగా మాట్లాడి అమలయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

క్రమబద్దీకరణ ప్రభుత్వ నిర్ణయం అని ఆయన అన్నారు. పై సమస్యలపై ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్ మాట్లాడుతూ క్రమబద్దీకరణ విషయం ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోని విషయం కనుక నిర్ణయం వారి మీదే ఆధారపడి ఉంది అన్నారు. వీరితో పాటు రాష్ట్ర సంఘం సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి ని కలసి పై సమస్యలను వివరించి వినతి పత్రాన్ని ఇచ్చి పి.టి.ఐ.ల కు అనుకూలంగా సమస్యల పరిష్కారం తోడుగా నిలబడాలని కోరారు. తప్పక సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి

Satyam NEWS

ఆలోచన ఆగదు అడుగు ముందుకు పడదు

Satyam NEWS

సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా శివపాల్ యాదవ్

mamatha

Leave a Comment