25.2 C
Hyderabad
March 23, 2023 00: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

అమరావతిలో సుజనా చౌదరి భూములు ఇవి

botsa satyanarayan

రాజధాని ప్రాంతంలో తనకు భూములు లేవని తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపికి జెంప్ అయిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. తనకు రాజధాని ప్రాంతంలో భూమలు లేవని చెప్పిన సుజనా చౌదరి దమ్ముంటే అందుకు ఆధారాలు బయటపెట్టాలని కూడా ఏపి ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఆయన సవాల్ చేయడం ఏమో కానీ గుట్టు మొత్తం రట్టు అయింది. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి ప్రాంతంలో సుజనా చౌదరి కి ఉన్న భూముల వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించారు. సుజనా చౌదరి సోదరుడి కుమార్తె యలమంచిలి ఋషికన్య పేరు మీద చందర్లపాడు మండలం గుడిమెట్లలో 14 ఎకరాల భూమి ఉందని మంత్రి వెల్లడించారు. అదే విధంగా సుజనా చౌదరికి చెందిన కళింగ గ్రీన్ టెక్ కంపెనీ పేరు మీద 110 ఎకరాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వీరులపాడు మండలం గోకరాజు పాలెంలో ఉన్న ఈ భూములు సుజనా చౌదరి అల్లుడికి సంబంధించినవని మంత్రి బొత్స వెల్లడించారు. చంద్రబాబు బంధువులకు ఎకరా రూ.లక్షకే 500కుపైగా ఎకరాలు కట్టబెట్టారని మంత్రి స్పష్టం చేశారు. అక్రమాలు జరిగిన భూముల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.రాజధాని కోసం జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామన్నారు. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి 493 ఎకరాలు లక్ష రూపాయల చొప్పున రామారావు కి ఇచ్చారు. ఏపీ ఐ ఐ సీ ద్వారా భూమి ఇచ్చిన తర్వాత సీఆర్డీఏ లో కలిపారని మంత్రి తెలిపారు. భూములిచ్చిన రైతులకు ఏటా ఆగస్టు,సెప్టెంబర్ లోనే కౌలు డబ్బులు విడుదల చేస్తున్నారు, తామూ అదే చేశామని మంత్రి చెప్పారు. రాజకీయ లబ్ది కోసం ఏ అంశం దొరుకుతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. వారికి ఏ విషయం దొరకడం లేదని మంత్రి అన్నారు.

Related posts

పాత బస్టాండును వినియోగoలోకి తేవాలి

Satyam NEWS

చట్టబద్ద అనుమతులే లేని ఎల్ జి పాలిమర్స్

Satyam NEWS

ఎస్.పి. మృతికి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సంతాపం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!