27.7 C
Hyderabad
April 24, 2024 08: 37 AM
Slider ప్రత్యేకం

తారాస్థాయికి చేరిన కుమ్ములాటలు: మంత్రి బొత్స నిర్ణయం ఏమిటో….

#ministerbotsa

రాజ‌కీయం అంటే రాక్ష‌స‌జ‌నానికి కీడు చేసే యంత్రాంగం..అప్పుడెప్పుడో ప్ర‌తిధ్వ‌ని సినిమాలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన డైలాగ్ అది. తాజాగా…రాక్ష‌స‌జ‌నం అన‌క‌పోయిన‌ప్ప‌టికీ…కులాల కుమ్ములాట‌లో…విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌దవి ఎవ‌రిని వ‌రిస్తుందో అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

గ‌డ‌చిన ప‌దేళ్లుగా  జిల్లా  తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్న మ‌జ్జి శ్రీనివాస‌రావు(చిన్న‌శీను)కే జెడ్సీ  చైర్మ‌న్ ప‌ద‌వి  వ‌ర‌స్తుంద‌ని అంద‌రి నోటివెంట న‌లుగుతున్న స‌మాదానం. తాజాగా కులాల స‌మీక‌ర‌ణలో ఒకే కులానికి  చెందిన రెండు  ప‌ద‌వులు ఇస్తే..వైఎస్ఆర్సీ భ‌విష్య‌త్ ఏంటని విశ్లేషకులు అంటున్నారు. ఇదే క‌నుక  జ‌రిగితే పార్టీ అధిష్టానం…ఎమ్మెల్యే బొత్స‌ను..మంత్రి ప‌ద‌వి వ‌దుల‌కోవాల‌ని చెప్పిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే  అమ‌రావ‌తి నుంచీ ఈ సాయంకాలం ఉన్న ప‌ళంగా విజ‌య‌న‌గ‌రం  వ‌చ్చిన మంత్రి బొత్స‌..త‌న కుటుంబంతో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు..చిన్న శీను కు  జెడ్పీ చైర్మ‌న్ ప‌దవి ఇస్తే..త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంట‌నిదానిపైన  బొత్స కుటుంబం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. అదీగాక కేవ‌లం  బొత్స  స‌త్య‌నారాయ‌ణ కారణంగానే జిల్లా లో వైఎస్ఆర్సీపీ కి గుర్తింపుతోపాటు తొమ్మిది నియోజ‌క వ‌ర్గాల‌లోనూ బొత్స త‌న‌ అనుచ‌రులనే గెలిపించుకుని..త‌న‌స‌త్తా ఏంటో పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్  ను చూపించారు.

ఇక చిన్న శీను…మంత్రి బొత్స‌కు ద‌గ్గ‌ర బంధువు. త‌న రాజ‌కీయ‌చ‌తుర‌త‌, ప‌లుకుబ‌డితో.. బొత్స కుటుంబానికి ద‌న్నుగానే గ‌డ‌చిన ప‌దేళ్ల నుంచీ  ఉంటూ వస్తున్నారు. ఈ క్ర‌మంలో  ఎప్ప‌టి నుంచీ జెడ్పీ చైర్మ‌న్ అవ్వాల‌న్న క‌ల స్థానిక సంస్థ‌ల ఎ న్నిక‌ల పుణ్య‌మా నెర‌వేర‌బోతోంది. అదే గ‌నుక జ‌రిగితే…జెడ్సీ చైర్మ‌న్ ప‌దవి అంటే మంత్రిప‌ద‌వితో స‌మానం.  ఈ ర‌కంగా  ఒకేకులానికి చెందిన ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ట్టే అవుతుంది. 

ఈ నేప‌ధ్యంలో మంత్రి బొత్సను మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవాల‌నిపార్టీ అల్టిమేటంఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప‌ర్య‌వ‌స‌నంగా జెడ్పీ చైర్మ‌న్ ఎన్నిక  సీల్డ్ క‌వ‌ర్ లోఉన్న‌ట్టు  తెలుస్తోంది.దీంతో పార్టీముఖ్య‌మా…?ప‌ద‌విముఖ్య‌మా…? అన్న‌ది తేల్చుకోవాల్సి వ‌స్తుంది.చూద్దాం… ఈ  25 న జెడ్పీ  చైర్మ‌న్  గిరి ఎవ్వ‌రిని వ‌రిస్తుందో….?

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

అభివృద్ధి పేరుతో కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంట్రాక్టర్

Satyam NEWS

ఒదుగుతూ ఎదగడం తన నైజం

Sub Editor 2

అర్హులందరికీ నవరత్నాలు అందించేందుకు ‘వైఎస్సార్ నవశకం’

Satyam NEWS

Leave a Comment