Slider తెలంగాణ

ఇంటింటికి భగీరథ నీళ్లపై అశ్రద్ధ వద్దు

errabelli

మిషన్ భగీరథ కార్యక్రమంలో ఏ ఒక్క చిన్న పని సైతం పెండింగ్ లో ఉండవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ తాగునీరు అందించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యాన్ని సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు. వర్షాలతో అన్ని జిల్లాల్లోనూ జలవనరులు ఉన్నాయని, తాగునీటి సరఫరా సవ్యంగా నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కింద గ్రామాలలో చేపట్టిన అన్ని ట్యాంకుల నిర్మాణం సత్వరం పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా పైపులైన్ల ఏర్పాటు కోసం తవ్విన రోడ్ల మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా తాను గ్రామాల్లో పర్యటిస్తున్నానని మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అక్కడక్కడా అవాంతరాలు ఉన్నట్లుగా ప్రజలు చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించకపోవడం వల్ల పలు గ్రామాల్లో చిన్నస్థాయిలో సమస్యలు ఉన్నాయని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు

Related posts

సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపు రద్దు

mamatha

“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

mamatha

శ్వేతా మహంతి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

mamatha

Leave a Comment