31.2 C
Hyderabad
February 14, 2025 19: 53 PM
Slider వరంగల్

జై కిసాన్ :పొలం దున్ని, నీరు పెట్టి రైతుగా మారిన తెలంగాణ మంత్రి

minister erabelli tractor

నిత్యం బిజీ గా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుగా మారాడు.వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన పొలంలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్ని నీరు పెట్టారు. మహిళలతో కలిసి నాటు వేసారూ. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పారిశుధ్యం, డ్రైనేజీని పరిశీలించారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలను సమాయత్తపరుస్తూ బిజీ గా ఉన్న అయన తన స్వగ్రామం పర్వతగిరి వచ్చారు.

పక్క రైతు గేటప్ లోతన కుమారుని తో కలిసి వచ్చిన మంత్రి తన పంట పొలాలను పరిశీలించారు. పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్ళి పచ్చటి కళతో ఉట్టిపడుతున్న పంట భూములను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు.మంత్రి అంగరక్షకులను పొలం గట్టున నిలబెట్టి వరి పొలంలో నాటు వేసి, కాసేపు ట్రాక్టర్ డ్రైవర్ గా మారడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్య పోయారు.

మంత్రి హోదాలో ఉన్న ఆయన స్వయంగా తన పొలాన్ని తానే దుక్కి దున్నడం చూసి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆయనకున్న మక్కువ చూసి ఆశ్చర్య పోయారు.మొత్తానికి అసలు సిసలైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా తనకు తానూ నిరూపించుకున్నారు.

Related posts

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ

Satyam NEWS

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS

సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

Satyam NEWS

Leave a Comment