రాజకీయంగా వేడిని ఎదుర్కొంటున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజల నుంచి కూడా నిరసనలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి ప్రబలిపోయి ఎందరో చిన్నారులు కూడా బలి అవుతున్న తరుణంలో ఆయన కు పనిభారం కూడా పెరిగింది. జిల్లాల్లో అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో ఆయన తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కూడా లేని విషయం ఎక్కడిక్కడ మంత్రి కి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇన్ని వత్తిడులలో ఉన్న మంత్రి ఈటెల రాజేందర్ కు ప్రజలు కూడా నిరసన తెలుపుతున్నారు. పెద్దపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రసంగాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
previous post
next post