27.7 C
Hyderabad
April 18, 2024 07: 03 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి ఈటల రాజేందర్ కు ఘోర అవమానం

#EtelaRajendar

తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని..  ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు.

‘సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్‌ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని ఈటల మీడియాతో అన్నారు.

రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్‌ శాఖలేని మంత్రిగా మారారు.

ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు తేల్చారు.

Related posts

వాలీబాల్ క్రీడాకారుడికి ములుగు జెడ్పి చైర్మన్ సాయం

Satyam NEWS

నెమ్లీ సాయిబాబా మందిరానికి భక్తుల పాదయాత్ర

Satyam NEWS

రాజకీయ అపరిపక్వత: రాజ్యసభ సీట్ల వ్యవహారం

Satyam NEWS

Leave a Comment