27.7 C
Hyderabad
April 25, 2024 10: 17 AM
Slider కరీంనగర్

వరద నష్టం అంచనా వేసిన మంత్రి ఈటల రాజేందర్

#EtalaRajendar

వరద తీవ్రత తో నష్టపోయిన పంటలను, ఇళ్ళను పరిశీలించేందుకు హుజురాబాద్ నియోజకవర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి చెరువులు కుంటలు నిండి, తవ్వుకున్న బావులో, వేసుకున్నా బోర్లలో నిండుగా నీళ్లు నిండి ప్రతి వాగు వంక పారి పచ్చటి పొలాల్లో మంచి దిగుబడి వస్తుంది అనుకున్న సమయంలో.. అకాల  వర్షాల వల్ల అంతా అతలాకుతలం అయిందని మంత్రి అన్నారు.

నోటి కాడికి వచ్చిన వరి నీళ్లలో మొలకెత్తింది. పత్తి పొలాలు కళ్ళముందే నేలను తాకి కుళ్ళి పోయి, కాయలు నల్లగా అయిపోయాయి. నేను కొన్ని గ్రామాల్లో తిరిగి చూశాను రైతులు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు అని మంత్రి అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఫ్రీ సాగునీరు ఇచ్చింది రైతుబందు ఇచ్చి ప్రతి గింజని కొని రైతు ను ఆదుకున్న ప్రభుత్వం… కాబట్టి, ఇప్పుడున్న అసాధారణమైన పరిస్థితుల్లో ఎం చేయాలి రైతాంగాన్ని ఎలా అదుకోవలో తప్పకుండా ముఖ్యమంత్రి, మేము అందరం ఆలోచన చేస్తాం అని మంత్రి అన్నారు.

కమలపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామం లో గాలి సునామి

నీళ్ల సునామి విన్నాం కానీ గాలి సునామి వినలేదు ఆ గ్రామం లో 500మీ వెడ్త్ తో కిలోమీటర్ పొడవు తో ఉన్న అన్ని ఇండ్ల ను కూల్చి వేసిందని మంత్రి తెలిపారు. ఊహించని రీతిలో నష్టం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రాణాపాయం జరగలేదు. మనుషులు బయట ఉంటే పదుల సంఖ్య లో మరణాలు జరిగేవి. చాలా భయాంకరం గా గాలి సునామి వచ్చింది నిన్న మా అధికారులు సర్వే చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కి నివేదించి గాలి సునామి లో నష్టపోయిన వాళ్ళని ఆదుకొనే చేస్తాం అని మంత్రి అన్నారు.

నీళ్ల సమస్య ఉండొద్దు అని SRSP కాలువను బాగుచేసుకున్నాం వాగుల మీద చెక్ డ్యామ్ లు కట్టుకున్నాం చెర్లన్నీ మిషన్ కాకతీయ ద్వారా బాగుచేసుకున్నాం కానీ ఈ జల దాటికి ఎన్నడూ లేనట్టుగా ఫస్ట్ టైం LMD డ్యామ్ మొత్తం గేట్ లు ఓపెన్ చేసాం.. ఈ జల దాటికి కొన్ని గండ్లు పడ్డాయి కొన్ని కొట్టుకుపోయాయి. ఇవన్నీ సకాలంలోనే మరమ్మతులు చేయాలని మా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి అన్నారు.

Related posts

నిహారిక సంగీత్ సంబరాల్లో మెగా ఫ్యామిలీ సాంగ్

Satyam NEWS

అభం శుభం తెలియని పసి మనసులు పరిమళించాలి

Satyam NEWS

రిజిస్ట్రేషన్లపై ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత హ‌ర్ష‌ణీయం

Sub Editor

Leave a Comment