27.7 C
Hyderabad
April 20, 2024 00: 12 AM
Slider ముఖ్యంశాలు

కరోనా అరికట్టేందుకు మరింత సమర్ధంగా పని చేయాలి

#MinisterEtala

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, వైరస్ సోకిన వారు మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలని మరోమారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

ప్రధానంగా గ్రామస్థాయిలో ఉన్న ఆశ వర్కర్లు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఉన్న డాక్టర్లు కరోనా వైరస్ రోగులను వెంటనే గుర్తించడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా వైద్య అధికారులతో మంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో అన్నారు.

టెస్టింగ్ ట్రీతింగ్ ట్రాకింగ్ వాక్సినేషన్ లతో పాటు, ఇతర వైద్య సేవలు కూడా అందిస్తూ నిరంతర బిజీగా వైద్య సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయి డాక్టర్లకు సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. మరికొద్ది రోజులు ఇదే యుద్ధ వాతావరణంలో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఆశా వర్కర్లకు, ప్రాథమిక ఆరోగ్య స్థాయి డాక్టర్లకు, సిబ్బందికి అవసరమైన పర్సనల్  కేర్ ఎక్విప్మెంట్ లు అన్ని సకాలంలో అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ లో ఆక్సిజన్, రేమేదేస్విర్ ఇంజెక్షన్ల కొరత లేకుండా చూడాలని కోరారు.  సాధ్యమైనంతవరకు ఎక్కువ మంది పేషెంట్లను హోమ్ ఎలివేషన్ లో ఉంచే విధంగా కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు.

సీరియస్ అయిన పేషెంట్లకు ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. చనిపోయిన వారిను వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. 

స్థానిక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల తో సమన్వయం చేసుకొని మృతదేహాలను అందించాలని సూచించారు.

ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈసారి వైరస్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల గుంపులుగా చెరవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కువమంది ఒకే  ప్రాంతాల్లో గుమికూడినప్పుడు ఏ ఒక్కరికి కరోనా వైరస్ వచ్చిన అందరికీ పరీక్షలు చేసే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని తెలిపారు.

టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. ఈ  టెలికాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రెజ్వి,  డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు,   నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

Related posts

ఆనందయ్య కరోనా మందు కోసం బారులుతీరిన జనం

Satyam NEWS

అంధురాలిని ఆదరించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ప్ర‌సిద్దిగాంచిన విజ‌య‌న‌గ‌రం సంగీత‌ క‌ళాశాల‌లో క‌చేరీలు….!

Satyam NEWS

Leave a Comment