36.2 C
Hyderabad
April 25, 2024 21: 20 PM
Slider కరీంనగర్

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

#MinisterEtala

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితంగా అందచేస్తారని, కరోనా టీకా వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో మొదటి కరోనా టీకాను మంత్రి తీసుకొని  రెండవ విడత కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన వారికి, 45 నుండి 59 వయస్సు గల వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా కరోనా టీకా ఇస్తారని ఆయన తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో 250/- రూ.లకు ఒక డోస్ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోండి

కరోనా టీకా తీసుకొనేందుకు ఆన్ లైన్లో తమ పేర్లను నమోదు చేసుకొవాలని పేర్కొన్నారు. జిల్లాలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో చల్మెడ ఆనంద రావు, ప్రతిమ వైద్యశాలలో కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుండి ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు.

త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య శ్రీ, ఈ.హెచ్.ఎస్. ఆసుపత్రులలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కరోనా టీకా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ప్రజలు తొందరపడవద్దని మంత్రి సూచించారు.

కరోనా టికాలు ప్రైవేట్ ఆసుపత్రులలో ఇచ్చుటకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరుపున  కోరామని మంత్రి తెలిపారు. కెంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కరోనా టీకాను ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇచ్చేందుకు అనుమతించిందని ఆయన తెలిపారు.

విజయవంతంగా మొదటి దశ… ఇప్పుడు రెండో దశ టీకా కార్యక్రమం 

కరోనా టీకాను రాష్ట్రంలో మొదటి దశలో ప్రంట్ లైన్ వారియర్స్ లలో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లకు ఇతర వైద్య సిబ్బందికి మొదటి, రెండవ డోసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు గ్రామా పంచాయితీలలో పనిచేసే వర్కర్లకు పోలీసు, రెవెన్యూ ఇతర సెక్యూరీటీ సిబ్బందికి మొదటి, రెండవ డోస్ కరోనా టీకాలను ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

రెండవ విడతలో 60 సంవత్సరములు పైబడిన సాధరణ ప్రజలందరికి, దీర్ఘకాలీక జబ్బులతో షుగరు, కిడ్నీ, డయాలసిస్, గుండె జబ్బు, లివర్, బి.పి. సంబంధిత మొదలగు వ్యాధులతో బాధపడుతున్న 45 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ కరోనా టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్చి 01 సోమవారం హుజురాబాద్ లో ప్రారంభించామని ఆయన తెలిపారు.

తెలంగాణలో కరోనా కేసుల తగ్గుముఖం

రాష్ట్రంలో కరోనా తగ్గుతుందని మంత్రి తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి భయము లేదని, అన్నారు. కరోనా వ్యాక్సిన్ అన్ని దేశాలలో ఇస్తున్నారని తెలిపారు. కరోనా టీకా కార్యక్రమం వల్ల కరోనా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని మంత్రి వెల్లడించారు.

ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక, వైద్య,విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు

Satyam NEWS

మా నిధులు కొల్లగొట్టారు: గవర్నర్ కు సర్పంచ్ ల ఫిర్యాదు

Satyam NEWS

ఉద్దానం సేవా సమితి సభ్యుడికి ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment