గురునానక్ దేవ్ 550 వ జయంతి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న గురుపర్వ్ లో భాగంగా రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు నానక్ దేవ్ మానవులందరూ ఒక్కటేనని ప్రబోధించారనీ, అన్ని ధర్మాలనూ అందరూ గౌరవించాలనీ కోరారు. ఎవరినీ శారీరకంగా , మానసికంగా హింసించరాదనీ, ఆహారాన్ని అందరితో పంచుకుని తినాలనీ, నిజాయితీగా సంపాదించాలనీ, ధ్యానం ద్వారా భగవంతునికి చేరువ కావాలనీ నానక్ ప్రబోధించారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నానక్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో అధికారులను మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు.
previous post