కేసీఆర్ కోసం రక్తం ధారపోస్తానని కొత్తగా మంత్రి అయిన గంగుల కమలాకర్ ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం అని అందుకే ఈ జిల్లా నుంచి నలుగురికి మంత్రిపదవులు ఇచ్చారని స్పష్టం చేశారు. జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. జీవితకాలం రక్తం ధారపోసి పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు కేటాయించిన పౌర సరఫరాల శాఖను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి కమలాకర్ చెప్పారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేలా సహకరించాలని మంత్రి గంగుల కోరారు. టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మెుట్టమొదటి ఎమ్మెల్యే తానేనని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చూస్తే సీఎంలా కనిపించరని ఆయన ఓ డిక్షనరీ అంటూ ప్రశంసించారు. కరీంనగర్‌లో స్మార్ట్ సిటి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పొగడ్తలతో ముంచెత్తారు. నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతానని రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
previous post