కాంగ్రెస్, బీజేపీ లకు ఓటు వేయడమంటే గాడిదకు గడ్డి వేసి బర్రె నుండి పాలు పిండాలనుకోవడమేనని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో నేడు ఆయన పాల్గొన్నారు. భారీ ర్యాలీతో మంత్రి హరీష్ రావు కు టిఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు.
అనంతరం బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. తెలంగాణ ప్రజలపార్టీ టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటే, తెరాసకు హైకమాండ్ తెలంగాణా ప్రజలేనని ఆయన అన్నారు. భారతదేశం లోఎక్కడా లేని పథకాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని, పేదింటిఆడపిల్లల పెళ్లికి లక్ష నూట పదహార్లు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.
వితంతు, వృద్ద్యాప్య, బీడీకార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తోన్న ఏకైకరాష్ట్రఃం తెలంగాణ అని ఆయన తెలిపారు. పెన్షన్ల కోసం ఏడాదికి వేయి కోట్లు ఖర్చు చేస్తున్నామని 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వివరించారు.
ఆర్థిక మాంద్యం ఉన్నా ఆసరా, కల్యాణ లక్ష్మి పథకాలకు నిధులు ఆపొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని హరీష్ రావు అన్నారు. మంత్రి కేటీఆర్ ఇటీవలే జవహర్ నగర్ అభివృద్ధికి ఇరవై ఎనిమిదికోట్లు ప్రత్యేకంగా మంజూరు చేశారు. ఇంకా అభివృద్ధి చేస్తారు. కారు గుర్తుకే ఓటు వేయాలి. కారు కేసీఆర్ నినాదం కావాలి అని హరీష్ రావు తెలిపారు.