28.7 C
Hyderabad
April 24, 2024 04: 27 AM
Slider తెలంగాణ

గుడ్ వర్డ్: అమ్మ ఆనందం కోసం మీరు కష్టపడి చదవండి

harish rao

కూలీ పని చేసి అమ్మ నాన్న కష్ట పడుతుంటే మీరు‌ ఎందుకు‌ కష్టపడి చదవడం‌ లేదని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు క్లాప్ పీకారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదవ తరగతిలో వంద శాతం‌ ఫలితాలు సాధించిన స్కూల్లో ఇంటర్‌ నలభై శాతానికి ఎందుకు పడిపోయింది? ఇంటర్ లో ఎందుకు ఎక్కువ మంది‌ ఫెయిలవుతున్నారు? మీరు కష్టపడి చదడం లేదా? అంటూ మంత్రి హరీష్ రావు విద్యార్థులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ సమయంలో ‌చదవకుండా ఫేస్ బుక్, ట్విట్టర్, టిక్ టాక్, వాట్సప్, టీవీలు, సినిమాలు చూస్తే జీవితమంతా‌ తల వంచుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీరు ఫెయిలవడం మీ అమ్మకు గౌరవమా..ఓ విద్యార్థిగా ఆలోచించు. ఫస్ట్ క్లాస్ లో పాసయితే మీ అమ్మ ఎంత గర్వ పడుతుంది అంటూ ఆయన హితబోధ చేశారు.

ఐదు‌‍ వందల మంది చదవాల్సిన ఈ కాలేజ్ లో‌ 142  మంది మాత్రమే చదువుతున్నారు. ఎందుకు ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల‌ సంఖ్య పడిపోతుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయమై ఆలోచించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. కార్పోరేట్ కళాశాల విద్యార్థుల కన్నా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు చదావలన్న కసి ఎక్కువ ‌ఉండాలని ఆయన అన్నారు.

పేదరికం పోవాలంటే ‌కసిగా‌ చదివి గొప్ప వాళ్లు‌ కావాలని ఆయన అన్నారు. ఒకప్పుడు చిన్నకోడూరు కళాశాల  మంచి కళాశాల గా పేరు తెచ్చుకుంది. కానీ ఇవాళ కళాశాల విద్యార్థుల సంఖ్య తగ్గింది. 142 మంది విద్యార్థులు 11 మంది లెక్చరర్లు  ఉన్నారు. ఒక లెక్చరర్ తలుచుకుంటే 13 మంది విద్యార్థులను దత్తత తీసుకుని  పాస్ చేయించలేరా..? అంటూ అధ్యాపక బృందానికి సవాల్ విసిరారు.

పిల్లల కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. కష్టపడి పనిచేస్తూ తాము తినకుండా పిల్లలకు పెడుతూ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని కోరుకుంటారని ఆయన గుర్తు చేశారు. 100 శాతం రెజల్టు తెస్తే లెక్చరర్ లకు,విద్యార్థులకు సన్మానం చేస్తానని మంత్రి అన్నారు.

ఇంటర్ విద్యార్థి గౌతమ్ మొదటి సంవత్సరం ఏంపీసీ, అక్షిత ద్వితీయ సంవత్సరం ఏంపీసీలతో మంత్రి మాట్లాడారు. వంద శాతం రిజల్ట్స్ తెస్తారని తనకు మాట ఇవ్వాలని విద్యార్థినీ, విద్యార్థులచే చేతిలో చెయ్యేసి ప్రామీస్ తీసుకున్నారు. ఆ తర్వాత లెక్చరర్లతో మాట తీసుకున్నారు.

అనంతరం విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్, ఇంటర్ విద్యా ఆర్ఐఓ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పనికి మాలిన రాజద్రోహం చట్టం ఇంకా ఎందుకు?

Satyam NEWS

‘నవీన విద్యావిధానం’ విశ్వమంతటికీ దారిచూపాలి

Satyam NEWS

హ్యూమన్ రైట్స్ ముసుగులో దందా

Murali Krishna

Leave a Comment