రాష్ట్ర, జాతీయ శాస్త్ర, సాంకేతిక మండలుల తొలి సమావేశాలకు హైదరాబాద్ వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సైన్స్ & టెక్నాలజీ విభాగం ఆద్వర్యంలో ఇవాళ్టి నుంచి మొదటి శాస్త్ర, సాంకేతిక మండలుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బేగంపేట లోని హోటల్ హరిత ప్లాజాలో ఈ సమావేశాలను అటవీ, పర్యావరణ, శాస్త్ర &సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారులు, వర్సిటీ వీసీలు, ప్రోఫెసర్లు, సైంటిస్ట్ లు, నిపుణులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఈ సమావేశం జరుగుతున్నది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర, జాతీయ శాస్త్ర, సాంకేతిక మండలుల తొలి సమావేశం జరుగుతుంది.