28.2 C
Hyderabad
April 20, 2024 13: 03 PM
Slider ఆదిలాబాద్

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

#indrakaranreddy

వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా స‌హాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ తెలిపారు.

భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌ర‌ద నీటిలో మునిగి దెబ్బ‌తిన్న పంట‌ల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు.

శ‌నివారం నిర్మ‌ల్ జిల్లా పీచ‌ర‌, ధ‌ర్మారం, చింతల్ చాంద‌ గ్రామాల్లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పర్య‌టించి, పంట‌ల‌ను, చేప‌ల చెరువును ప‌రిశీలించారు. ఏ మేర‌కు  పంట న‌ష్టం వాటిల్లింద‌ని రైతుల‌ను,  అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భారీ వ‌ర్షాల‌ వలన వరద ఉధృతితో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయన్నారు.

వరదల తాకిడి వల్ల పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని, వారికి ప్రభుత్వ పరంగా స‌హాయం అందించేందుకు  రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుంద‌ని అన్నారు. వర్షాలు అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts

వేటు నుంచి మంత్రి ఈటలను ఇక ఎవరూ కాపాడలేరు

Satyam NEWS

ఇది రక్షకభుటుల కార్యాలయమా? బిఆర్ఎస్ కార్యాలయమా?

Satyam NEWS

ములుగు బస్ డిపో ఏర్పాటు పోరాటం ఫలించింది

Satyam NEWS

Leave a Comment