36.2 C
Hyderabad
April 25, 2024 20: 40 PM
Slider ప్రత్యేకం

‘ఢిల్లీ’ చీవాట్లతో మంత్రి కొడాలి నాని నోటికి తాళం

#KodaliNani

నోటికి ఏది వస్తే అది మాట్లాడే మంత్రి కొడాలి నానికి బెల్టు పడ్డట్టే కనిపిస్తున్నది. ఎవరినైనా ఏకవచనంలో మాట్లాడే కొడాలి నాని మరీ పరమ నీచమైన విమర్శలు చేస్తూ ఉంటారు.

ప్రధాని నరేంద్రమోడీని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ లను అత్యంత అమర్యాదగా మాట్లాడటంలో ‘ఢిల్లీ’ సీరియస్ అయినట్లు తెలిసింది.

ఢిల్లీ పెద్దల నుంచి సీరియన్ వార్నింగ్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నాని వ్యాఖ్యల నుంచి దూరం జరిగింది. ప్రధాని మోడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు.

 మోడీ దేశానికి ప్రధాని.. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రధానిపై మంత్రి కొడాలి నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదని చెప్పారు.

అయినా ప్రధాని మోడీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. మోడీ గురించి పార్టీలో ఎవరైనాసరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

పార్టీల నేతలు సంయమనం పాటించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. మంత్రి కొడాలి నానిని కలియుగ శిశుపాలిడిగా అభివర్ణించారు.

వందసార్లు మోడీని దూషించే దాకా ఓపిక పడతామని, ఇప్పుడు జగన్.. చంద్రబాబులా తన పతనాన్ని కోరి తెచ్చుకుంటారో, లేక తప్పులు గుర్తించి నానిని తొలగిస్తారో వేచిచూస్తామంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్లు చేసిన కొద్ది సేపటికే నాని కామెంట్లను వైసీపీ గర్హించడం గమనార్హం.

ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని వ్యక్తలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు.

ఎందుకంటే సజ్జల ప్రోత్సాహంతోనే కొడాలి నాని పూనకం వచ్చినట్లు పచ్చిబూతులు మాట్లాడుతారని, ఆ క్రమంలోనే ప్రధాని మోడీని కించపరిచే వ్యాఖ్యలు చేశారని వర్ల అన్నారు.

”ఇప్పుడు ఢిల్లీ సీరియస్ అయ్యే సరికి, మంత్రి నానికి చదువు సంధ్యలు లేవని, అవగాహన లేక అటువంటి వ్యాఖ్యలు చేశారని, అతన్ని క్షమించండి అని ప్రధాని కార్యాలయం తో బేరాలాడుతున్నారు” అని టీడీపీ నేత ట్వీట్ చేశారు.

Related posts

వైసీపీ రేబిస్ వచ్చిన కుక్క… అందరూ కలిసి తన్ని తరిమేయాలి

Satyam NEWS

ఏపి మంత్రి పేర్ని నానిపై తాపీతో అగంతకుడి దాడి

Satyam NEWS

విజయవాడ ఏసీపీకి జైలు శిక్ష విధించిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment