31.7 C
Hyderabad
April 25, 2024 01: 51 AM
Slider జాతీయం

జైపూర్ ఫుట్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

#Koppula Easwer

ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి,దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ గురువారం రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లోని భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితిని సందర్శించారు. ప్రసిద్ధి చెందిన “జైపూర్ ఫుట్” ను ఈ స్వచ్ఛంద సంస్థ తయారు చేసి అవసరమైన దివ్యాంగులకు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే.

భగవాన్ మహావీర్ బోధనల నుంచి స్ఫూర్తినొంది 1975లో స్థాపించి, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను నడిపిస్తున్నారు. మంత్రి, అధికారుల బృందం కృత్రిమ అవయవాల తయారీ, పనితీరును పరిశీలించారు.

నిర్వాహకులతో మంత్రి సమావేశమై సంస్థ ఏర్పాటు, ఆశయాలు, చేపట్టిన, కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు, భద్రతకు, సంక్షేమానికి,సముద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని కొప్పులఈశ్వర్ చెప్పారు.

దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా ప్రతినెల  3,016రూపాయల పింఛన్..90వేల రూపాయల విలువైన త్రిచక్ర వాహనాలు, వీల్ చైర్స్,ల్యాప్ టాప్స్, హియరింగ్ ఎయిడ్స్, 4జి స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు.

సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను తయారీ చేసే మోబైల్ వాహనాన్ని తమ  రాష్ట్రానికి కూడా అందజేయాలని మంత్రి కోరగా,సంస్థ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్ కింగ్ కోఠిలోని తమ సంస్థకు చెందిన యూనిట్ అభివృద్ధికి చేయూతనివ్వాలన్న వారి  విజ్ఞప్తిని తమ తెలంగాణా ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని మంత్రి కొప్పుల వారికి హామీనిచ్చారు. అంతకు ముందు సంస్థ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు.

Related posts

ప్రధాని దిష్టి బొమ్మ దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం

Satyam NEWS

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment