39.2 C
Hyderabad
March 29, 2024 15: 13 PM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్

#MinisterKTR

విద్యావంతులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనరన్న అపవాదు ఉంది. దాన్ని తొలగించుకొని గ్రాడ్యుయేట్లు పెద్దఎత్తున ఓటింగ్ వేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ లోని షేక్ పేట్  తాసిల్దార్ కార్యాలయంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గతంలో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా ఇంట్లో సిలిండర్ కి దండం పెట్టి వచ్చి ఓటు వేశాను అని ఆయన అన్నారు. విద్యావంతులు, యువకుల సమస్యలను అర్థం చేసుకొని తీర్చగలిగే సామర్థ్యం, అవకాశం ఉన్న అభ్యర్థికే ఓటు వేశానని కేటీఆర్ తెలిపారు.

ఆదివారం సెలవు అయినప్పటికీ తమ బాధ్యతగా బయటకు వచ్చి ఓటు వేయాలని విద్యావంతులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related posts

కడప నగరంలో వివాహిత దారుణ హత్య

Satyam NEWS

ఆవుల అక్ర‌మ ర‌వాణాకు పోలీసులు అడ్డుక‌ట్ట‌

Satyam NEWS

మోడీ మాటలే కమలం విజయ రహస్యం

Satyam NEWS

Leave a Comment