ఎవరికి అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న జోగురామన్నను లైన్లోకి తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. అంత పెద్ద కేటీఆర్ ఫోన్ పట్టుకున్నాక.. జోగి రామన్న లాంటోళ్లు సీన్లోకి రాకుండా ఉంటారా? దీనికి తగ్గట్లే పార్టీ అధినేత మీద అలకతో ఎవరికి అందుబాటులోకి లేకుండా తన దారిన తాము వెళ్లిపోయారు పలువురు టీఆర్ ఎస్ నేతలు. అలాంటి వారి కోపాన్ని తగ్గించటంతో పాటు.. వారిని బుజ్జగించటానికి ప్రత్యేక టీం రంగంలోకి రాగా.. ఎంతకూ కొరుకుడుపడని కొందరు నేతల విషయాన్ని తాను చూసుకుంటానన్న కేటీఆర్.. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిన జోగు రామన్నకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఆయన్ను బుజ్జగించటంతో పాటు.. భవిష్యత్తు పట్ల భరోసాను ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి హామీ ఇవ్వటంతో.. జోగు రామన్న కాస్త మెత్తబడ్డట్లుగా చెబుతున్నారు.
previous post