తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన ఆడపడుచులంతా కొత్త చీరలు కట్టుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండలో ముందుగా చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దేవతకు మొదటి చీరెను పెట్టి ములుగులో పంపిణీ చేస్తారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నారు.ఇక పట్టణ ప్రాంతాల్లో వార్డుస్థాయి కమిటీలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ఆఫీసు బేరర్, రేషన్ షాపు డీలర్లు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తారు. మొత్తం 1.02 కోట్ల మంది మహిళలు అర్హులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. మొత్తం పది రకాల డిజైన్లతో, పది రంగుల్లో ఈ చీరెలను తయారు చేయించారు. ఇందుకోసం రూ. 313 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.
previous post