27.7 C
Hyderabad
April 24, 2024 09: 37 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

పని చేస్తే పదవి ఇస్తా మీకు ఓకేనా?

KTR-Rao

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యత నిర్వహిస్తూ ఇటీవలే తెలంగాణ మంత్రి గా కూడా పదవీ బాధ్యతలను స్వీకరించినటువంటి కేటీఆర్‌ ఇకమీదట తెలంగాణాలో పార్టీ ని బలోపేతం చేయడానికి కొత్త స్లోగన్ అందుకున్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా పార్టీ క్యాడర్‌ను సంసిద్దం చేస్తున్నారు. రానున్నన్న ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి నామినేటేడ్‌ పదవుల్లో గుర్తింపు ఉంటుందని వారికి స్పష్టం చేస్తున్నారు. కాగా ఇప్పటికే 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో టిఆర్ఎస్ ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు.

ఇకపోతే తెలంగాణాలో త్వరలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల కోసం మాట్లాడిన మంత్రి కేటీఆర్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కష్టపడదామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దానికితోడు జిల్లాల వారీగా పార్టీకి సంబంధిచిన కమిటీలు ఏర్పాటు చేసి మరీ చర్చలు జరుపుతామని కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీ సంస్థాగత బలంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిలోకి తీసుకెళ్ళేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఇకపోతే పార్టీకి సంబందించిన విస్త తస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తదితర అంశాలను చర్చిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

కాగా ఈనెల 15 నుండి టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్‌ ఎన్నికలకు సంబందించిన కార్యాచరణను రూపొందించనున్నారని సమాచారం. మున్సిపాలిటీల్లో పార్టీ మండల, బూత్‌ కమిటీలతో అన్ని రకాల సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ప్రధాన నేతలు అందుకోసం మున్సిపాలిటీల్లో తాజా పరిస్థితులను ఇన్‌చార్జ్‌లు అధిష్టానానికి అందజేశారు. అయితే ఆ నివేదికలో చాలా వరకు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమ పార్టీ గ్రూపులుగా విడిపోయిందని చెబుతున్నారు.

దానికోసం ఇకమీదట తెలంగాణ భవన్‌ లో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలనీ, ఆలా అయినా పార్టీ పుంజుకుంటుందని వారికోసం పలు ప్రణాళికలను సిద్ధం చేయాలనీ ఇంఛార్జుల అందరికి కేటీఆర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు.మొత్తానికి మంత్రి వర్గ విస్తరణలో వచ్చిన అసంతృప్తిని ఈ విధంగా చల్లార్చే పనిలో నిమగ్నమయ్యారు కెటీఆర్‌ సారు.

గుమ్మడి  శ్రీనివాస్

Related posts

బయ్ఇట్ :అమ్మకానికి మాల్యా విలాసవంతమైన భవనం

Satyam NEWS

బిల్ట్ పునరుద్ధరణ లో జాప్యం సహించేది లేదు

Satyam NEWS

అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

Leave a Comment