24.7 C
Hyderabad
March 29, 2024 08: 09 AM
Slider కరీంనగర్

అయ్యా నాకేం వద్దు మా శాలోళ్లకు న్యాయం చేయండి

#MinisterKTR

మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటే చాలు ఎంతో మంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హజరైన కేటీఆర్ తిరుగుపయనంలో ఓ దివ్యాంగ వృద్ధురాలు మంత్రి కేటీఆర్ ను గట్టిగా పిలిచింది. పిలుపు విన్న కేటీఆర్ వృద్దురాలి వద్దకే వెళ్లాడు.

ఏమ్మా ఏమైనా పెన్షన్ అవసరం ఉందా..ఏ సమస్య ఉంది అని అడిగాడు. సారూ నేను వచ్చి రెండు గంటలవుతుంది..ఎవరు లోపలకు రానిస్తలేరు..మీ పుణ్యాన నెలకు మూడు వేల పెన్షన్ వస్తుంది కానీ సారూ.. మా అల్లుడు సూర్యాపేట జిల్లా..తిరుమలగిరి పక్కన.. మానుపురంల ఉంటడు.

అక్కడ 30 కుటుంబాలు శాలోల్లయి ఉన్నయి. రెండు నెల్లుగా.. వారికి పని నడుత్తలేదు.. బట్ట ఎవలు కొంటలేరు..వాళ్లను ఆదుకొండి సారూ..ఊకే మా అల్లుడు నిన్ను యాది జేస్తడు..సిరిసిల్ల శాలోల్లకు కేటీఆర్ మంచిగా చేస్తుండే అని..నాకు బాగా సార్లు చెప్పిండు సారూ.

మా అల్లుని ఊరోళ్లకు ఏమైన సాయం చేయండి అంటూ సిరిసిల్ల పట్టణానాకి చెందిన పులి విజయమ్మ(60) అనే వృద్దురాలు మంత్రి కేటీఆర్ ను ఆర్థించింది. ఇంతసేపు వెయిట్ చేసి నిల్చోని చెప్పుకున్నది నీ సమస్య కాదా..పక్కా జిల్లాలో చేనేత కార్మికుల సమస్య గురించా అని కేటీఆర్ చలించిపోయాడు.

వెంటనే నల్లొండ జిల్లా కలెక్టర్ ను లైన్లోకి తీసుకోవాలని పక్కనే ఉన్న పీఎస్ శ్రీనివాస్ ను ఆదేశించారు. మానుపురమే కాదు నల్లొండ జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులు.. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తిస్తున్నాయా లేదా..ఎందుకు అక్కడ సమస్య తలెత్తింది..అన్ని విషయాలు తెలియాలని కేటీఆర్ ఆదేశించడంతో సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు మీద మానుపురం క్యూ కట్టారు.

చేనేత కార్మికుల సమస్యలపై నివేదికను తయారు చేస్తున్నారు. దీంతో పాటు దివ్యాంగ వృద్దురాలు అద్దెకు ఉంటున్నని చెప్పడంతో ఆమె స్థితి గతిని చూసి ..తగిన సాయం చేయాలని ఆదేశించడంతో సిరిసిల్ల తహశీల్ధార్ అంజన్న ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది విజయను తీసుకొని ఆవిడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. సాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Related posts

సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

అడవి పంది మాంసం అమ్ముతున్న నలుగురి అరెస్ట్

Satyam NEWS

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యం

Satyam NEWS

Leave a Comment