37.2 C
Hyderabad
March 28, 2024 19: 31 PM
Slider నల్గొండ

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్: మంత్రి కెటిఆర్ ని బర్తరఫ్ చేయాలి

#congress

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా సెంటర్లో పేపర్ లీకేజీ దోషులను శిక్షించాలని,దానికి బాధ్యుడైన మంత్రి కెటిఆర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా, రాస్తారోకో,నిర్వహించి మంత్రి కెటిఆర్  దిష్టిబొమ్మతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి,అనంతరం కెటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,రాష్ట్ర మాజీ పి.సి.సి సభ్యుడు సాముల శివారెడ్డి,మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్,సీనియర్ నాయకులు బాచిమంచి గిరిబాబు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య తదితరులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కెటిఆర్ పి.ఏ తిరుపతి పాత్ర ఉందని,ఇంటి దొంగలు బయటపడతారని కెటిఆర్ హడావుడిగా బయటకు వచ్చి బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మంత్రి కెటిఆర్ కి ఏమాత్రం విశ్వాసం ఉన్నా తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటుందని,అట్టి కుటుంబాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత నిరుద్యోగులపై ఉందని,జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇట్టి లీకేజ్ దందా ఇప్పుడు నుండి కాకుండా కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అన్ని ఉద్యోగ నియామకాల ప్రవేశ పరీక్షలలో అవకతవకలు జరిగినట్లు అర్థమవుతుందని అన్నారు.లీకేజీ ఘటనపై తక్షణమే  సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని అన్నారు.టి ఎస్ పి ఎస్ సి కమీషన్ ని సైతం కల్వకుంట్ల కుటుంబానికి రాబడి కమిషన్ గా మార్చారని,ఐటీ మంత్రి తారక రామారావును వెంటనే భర్తరఫ్  చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు సుంకర శివరాం యాదవ్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు,మున్సిపల్ కౌన్సిలర్స్ తేజవత్  రాజా నాయక్, కోతిసంపత్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొట్టేముక్కల రాములు,హుజూర్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చక్ర వీరారెడ్డి, కర్కాయలగూడెం ఎంపిటిసి మచ్చ వెంకటేశ్వర్లు,పట్టణ వార్డు కమిటీ అధ్యక్షుడు వెలిదండ వీరారెడ్డి,కారంగుల వెంకటేశ్వర్లు,సులువా చంద్రశేఖర్,కందుల వినయ్,పులి బాలకృష్ణ,కోడి ఉపేందర్ యాదవ్,కంకణాల పుల్లయ్య,బంటు సైదులు,బుల్లెద్దు కార్తీక్,రెడపంగు రాము, కస్తాల సైదులు,పోతనబోయిన  రామ్మూర్తి,మోదాల సైదులు,నందిగామ శ్రీను,నూక తొట్టి ప్రమోద్,సంక్రాంతి కోటేశ్వరరావు,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, పల్లపు వెంకటేశ్వర్లు,దొంతగాని జగన్, తెప్పని అనిల్ కుమార్,చింతకాయల రాము,షేక్.ఉద్దండు,రేపాకుల కోటయ్య, దాసరి పున్నయ్య,బంకా శ్రీనివాస్ రెడ్డి, మొదల వెంకన్న,మేకల సైదులు,షేక్ ఫరీద్, గడ్డం అంజయ్య,కుక్కడుపు వీరబాబు, యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఫణిగిరి గట్టుపై రమణీయంగా శ్రీ సీతారామకళ్యాణం

Satyam NEWS

దేశ వ్యాపిత సమ్మెలో భాగంగా దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

Satyam NEWS

శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment