32.2 C
Hyderabad
March 28, 2024 22: 42 PM
Slider తెలంగాణ

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

ktr new zealand

న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈరోజు న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ (పార్లమెంట్ సబ్యురాలు) ఈరోజు మంత్రి కెటి రామరావును ప్రగతి భవన్ లో కలిసారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టంలో న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈ సమావేశంలో స్ధానిక రాజకీయ వ్యవస్ధల పనితీరుపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్ధితులను మంత్రి కెటియార్, ప్రియాంకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని, టిహబ్, విహబ్ వంటి ఇంక్యూబేటర్ల ద్వారా ఈ రంగంలో ముందున్నామన్నారు. దీంతోపాటు త్వరలోనే టి హబ్ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న వీదేశీ స్టార్ట్ అప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశ్యించిన టి- బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టి బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్ట్ అప్స్ తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలన్నారు. దీంతోపాటు అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు.

ముఖ్యంగా పెద్ద ఏత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీట ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే ఇక్రిసాట్ తో అగ్రిటెక్ రంగంలో పనిచేస్తున్నామని మంత్రి కెటియార్ తెలిపారు.

దీంతోపాటు న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా అర్డన్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నారని, అమె నాయకత్వం పట్ల మంత్రి కెటియార్ ప్రసంశలు కురింపించారు. అమెకు కలిసేందుకు తాను సమావేశం ఎర్పాటు చేస్తానని, న్యూజిలాండ్ లో పర్యటించాల్సిందిగా ప్రియాంక, కెటియార్ ను కోరారు.

ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రియాంక మంత్రి కెటియార్ కు తెలిపారు. ఈ సమావేశంలో ఏన్నారై టియారెస్ కో అర్డినేటర్ మహేశ్ బిగాల ఉన్నారు.

Related posts

సాంప్రదాయ వస్త్రాలలో స్వామివారి దర్శనం చేసుకున్న పవన్

Satyam NEWS

ఆలయానికి, సంఘ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

Satyam NEWS

కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్న సీఎం జగన్

Bhavani

Leave a Comment