33.2 C
Hyderabad
April 26, 2024 00: 19 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి పతనం ప్రారంభం

#wanaparthy

వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డికి పతనం ప్రారంభం అయిందని పెద్దమందడి మండల పరిషత్ అధ్యక్షుడు మేఘారెడ్డి చెప్పారు. వనపర్తిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం(మంత్రి నిరంజన్ వ్యతిరేక సభ) లో చెప్పారు. పోలీస్ కేసులకు, లాటి దెబ్బలకు భయపడే ప్రసక్తి లేదని, కేసులను ఎదుర్కొంటామని అయన తెలిపారు. ఎన్నికలకు ముందున్న ఆస్తులు, ప్రస్తుతమున్న ఆస్తులపై గుడిలో ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.

మనిగిల్ల గ్రామంలో యాదవ యువకుడిపై సిఐ శ్రీనివాసరెడ్డి  తో కొట్టించారని,అవినీతి, ఆరాచకం పెరిగిందని అయన విమర్శించారు. నిరంజన్ రెడ్డి ఖాదీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని, అప్పట్లో ఖాది బోర్డు రద్దయిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డిని ఓడించాలని అయన కోరారు. కొల్లాపూర్ లో పొత్తులో ఉండి పోటీ చేస్తే డిపాజిట్ రాలేదని, వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఓడిపోయారని తెలిపారు.వనపర్తిలో నిరంజన్ రెడ్డి గురించి ప్రజలకు వివరిస్తామని వనపర్తి ఎంపిపి కిచ్చారెడ్డి చెప్పారు.

తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ ను ఓడించాలని ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. జూపల్లి కృష్ణారావు, మేఘారెడ్డి, కిచ్చా రెడ్డి, కేసిఆర్ వ్యతిరేకులు కలిసి ఐక్యంగా ఉండి ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకుంటామని అయన తెలిపారు.పార్టీలో చేరే ముందు విలేకరులకు తెలుపుతామని చెప్పారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

Satyam NEWS

మూడేళ్ల వయసుకే ఓటు హక్కు ఇచ్చేశారు

Satyam NEWS

చంద్రబాబు ఏం జరిగిందని ఏపీ లో రాష్ట్ర పతి పాలన కోరుతున్నారు

Satyam NEWS

Leave a Comment