36.2 C
Hyderabad
April 24, 2024 19: 43 PM
Slider వరంగల్

అసియాలో అతిపెద్ద డోర్నకల్ చర్చిలో మంత్రి ప్రార్ధనలు

dornakal cherch

ఆసియాలోనే అతిపెద్దదైన, విశిష్టమైన డోర్నకల్ చర్చిలో క్రిస్మస్ పర్వదినం వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. డోర్నకల్ ప్రాంత కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ చర్చి ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి సత్యవతి అన్నారు.

ఈ చర్చితో, ఇక్కడి ప్రజలతో గత 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా డోర్నకల్ చర్చి ద్వారా ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి జరిగేలా ఆశీర్వదించాలని ఆ కరుణామయుడైన ఏసు ప్రభును కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే సిఎం కేసిఆర్ కి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.

డోర్నకల్ ప్రాంతం గత కొన్నేళ్లుగా కావాల్సిన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ అభివృద్ధి జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్.ఆర్.ఎస్.పీ ద్వారా నేడు డోర్నకల్ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Related posts

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam NEWS

కోమటిరెడ్డీ… రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటున్నావ్

Satyam NEWS

తెలంగాణ ఎమ్మార్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment