33.2 C
Hyderabad
April 25, 2024 23: 42 PM
Slider కర్నూలు

శివుడా! ఆయనెవరు? నా దేవుడు మంత్రి పెద్దిరెడ్డే!

#lavanna

దేవుడా? ఆయనెవరు??? నాకు దేవుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఆయనే నాకు శివుడు….అంటున్నాడీయన. ఆయన రాజకీయ నాయకుడో లేదా మరెవరో కాదు. శ్రీశైలం దేవస్థానం బాధ్యతలు నిర్వర్తించే ఈవో లవన్న. గుళ్లో ఉన్న శివుడికి మొక్కినా ఫలితం ఉంటుందా? ఆయన పలుకుతాడా ప్రమోషన్ ఇస్తాడా?

ఎంచక్కా మన మంత్రి కాళ్లు మొక్కితే కోరినన్న వరాలు ఇస్తాడు. స్వామి మాలదారణ ధరించి EO లవన్న దేవాలయానికి వచ్చిన మంత్రి పెద్దరెడ్డి కి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. మాలలో ఉన్న వాడు తల్లి తండ్రి దేవుడికి తప్ప మరెవరి కాళ్లూ మొక్క కూడదు. అదీ శివాలయ ప్రాంగణంలో అయితే ఇతరులకు మొక్కడం మరింత తప్పు. అలాంటిది శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలోనే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పాదాలపై పడిన ఈ లవన్న తన మొక్కులు తీర్చుకున్నాడు.

ఆ మంత్రితో గతంలో ఏదైనా లాభం పొందాడో లేక భవిష్యత్తులో లాభం రావాలనుకుంటున్నడో కానీ మంత్రి పాదాలపై పడి ప్రణమిల్లిన ఈవో లవన్న మరో వివాదంలో చిక్కుకున్నాడు. మల్లన్న స్వామి నీ మరిచి తన ఆరాధ్య నేతకు పెద్దపీట వేసిన లవన్న చర్యలు శివ భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారిపై శివ భక్తులు మండిపడుతున్నారు.

మల్లన్న శివమాల ధరించిన ఆలయ అధికారి మంత్రి కాళ్లను మొక్కడంపై వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న శ్రీశైల దేవస్థానం ఈవో ను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్న సాక్షిగా భక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గవర్నర్ విశ్వభుషన్ హారిచందన్ రానున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, పలు వివాదాల్లో కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆలయ అధికారి ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి పై స్వామి భక్తి చూపడంపై మరో వివాదం తెరపైకి వచ్చినట్లయింది. ఈ ఈవో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పూర్తిగా విఫలం కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీఐపీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడంతో జిల్లా అధికారులు చివాట్లు పెట్టారు. ఇలా శివుడి సన్నిధిలోనే కాళ్లు మొక్కించుకోవడం మంత్రి కి కూడా మంచిది కాదని, అందుకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. లేకపోతే మంత్రికి కూడా అరిష్టమేనని కూడా చెబుతున్నారు.

Related posts

ఇంకా సంక్లిష్టంగానే ఉన్న ములాయం ఆరోగ్యం

Satyam NEWS

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

Leave a Comment