32.7 C
Hyderabad
March 29, 2024 10: 25 AM
Slider ఖమ్మం

పీవీ సింధు కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు

#minister puvvada

టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం పతకాన్ని సాధించిన పీవీ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అభినందనలు తెలిపారు.

ఒలింపిక్స్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సింధు నివాసానికి వెళ్లి తనను కలిసి  శాలువతో సత్కరించి, శ్రీశ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు ఇరువురు వాలీబాల్ క్రీడాకారులు రమణ, విజయ ను కలిసి అభినందనలు తెలిపారు

ఈ సందర్భంగా ఒలింపిక్స్ కు సిద్ధం అయిన తీరు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తన మెడల్స్ రూమ్ కి తీసుకెళ్లి పతకాలను సింధు మంత్రి కి వివరించారు. ఒలింపిక్స్ లో వచ్చిన పతకం, అర్జున్ అవార్డు, తదితర పతకాలను చూపించి వాటి ప్రాముఖ్యత ను మంత్రికి వివరించారు.

ఖమ్మం క్రీడాకారుల కోరిక మేరకు ఖమ్మం లో చేపట్టే సన్మాన వేడుకకు రావాలని మంత్రి పువ్వాడ కోరారు. అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసి వచ్చేందుకు అంగీకరించారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరుసగా రెండు ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిందన్నారు. వరుసగా ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించడం గర్వించదగ్గ విషయమని, రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు.

భారత బ్యాడ్మింటన్ కి సింధు ఐకాన్ గా మారిపోయిందని, వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.సింధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటూ, ప్రోత్సాహం అందిస్తుందని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్  క్రీడలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.

Related posts

తొలిమెట్టు పకడ్బందీగా జరగాలి

Murali Krishna

ఫోనిక్స్ పెయింటింగ్, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

Satyam NEWS

రాష్ట్రంలో 5 పామాయిల్ పరిశ్రమల స్థాపనపై మంత్రి తుమ్మల తొలి సంతకం

Satyam NEWS

Leave a Comment