27.7 C
Hyderabad
April 24, 2024 09: 46 AM
Slider మహబూబ్ నగర్

విద్యుత్ సమస్యలపై స్పందించిన వ్యవసాయ మంత్రి

#MinisterNiranjanreddy

వనపర్తి పట్టణంలోని 30 వా వార్డులో విద్యుత్తు సమస్యలపై మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వినతి పత్రం సమర్పించారు.

స్పందించిన మంత్రి  హుట హుటిన విద్యుత్ డి.ఇ., ఏ.డి.ఇ., ఏ.ఇ.లను వార్డు లో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించడంతో ఉదయం డి.ఇ. నరేంద్ర కుమార్, ఎ. ఇ. రాజా గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలసి 30 వ వార్డు లో ఉన్న జంగిడిపూరం,ఐజయ్యకాలనీ, సాయినగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలను కాలినడకన మొత్తం తిరిగి వార్డులో లెలకొన్న విద్యుత్తు సమస్యలను తెలుసుకున్నారు. 

లోఓల్టేజ్, నుతన లైన్ల ఏర్పాటు నూతన ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించారు. డి.ఇ. సానుకూలంగా స్పందించి వెంటనే తీరుస్తానని చెప్పడం జరిగిందని, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, డి.ఇ. నరేందర్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : అదనపు ఎస్పీ నర్మద

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎంపీ?

Bhavani

మహిళా సంఘాల బకాయిలు విడుదల చేయకుంటే ఆమరణ దీక్ష

Satyam NEWS

Leave a Comment