34.2 C
Hyderabad
April 23, 2024 13: 31 PM
Slider విజయనగరం

మంత్రుల సమావేశంలో కరెంటు హాంఫట్

#vijayanagaram dist

ఓ వైపు జిల్లా సమీక్షా సమీక్షా సమావేశం…మరోవైపు భారీ వర్షం…ఇదీ విజయనగరం జిల్లా కేంద్రంలో నేడు ఎదురైన విచిత్ర పరిస్థితి. వాస్తవానికి ఉదయం జిల్లా సమీక్షా సమావేశం జరగాల్సి ఉంది.. కానీ ఆ సమయంలో సీఎం జగన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘జగనన్న తోడు’ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం కావడంతో… డీఆర్సీ సమావేశంలో మధ్యాహ్నం 2.30 కి మార్చారు.

ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ క్రమంలో సరిగ్గా కలెక్టరేట్ ఆడిటోరియంలో డీఆర్సీ సమావేశం జరుగుతుండగా బయట ఉరుకులు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం ప్రారంభమైంది.

కలెక్టరేట్ లో సమావేశం జరూగుతుండగా..రెండు సార్లు పవర్ పోవడంతో.. కొద్ది సెకన్లు చీకట్లో నే సమావేశం జరిగింది. అదీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతుండగా విద్యుత్ పోయింది. వెనువెంటనే కరెంటు రావడం తో మళ్ళీ డీఆర్ఎం ప్రారంభమైంది.

ఇక సమావేశం జరుగుతుండగా కారిడార్ లో మంత్రుల, ఎమ్మెల్యేలు గన్ మెన్ లు లాబీల్లో కూర్చుని.. స్మార్ట్ ఫోన్ లు చూసుకోవడం మీడియా కంట కనిపించింది. ఏదైనా ఒక డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ,అలాగే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు.

సమావేశంలో ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ అలాగే థర్డ్ వేవ్ రాబోతుందన్న ఊహాగానాలతో డీఆర్సీ లో చర్చ జరిగింది. ఈ సందర్భంలో జేసీ-2,డీఎంఅండ్ హెచ్ ఓ ను..డిప్యూటీ సీఎం ఓ ఆట ఆడించారు.

మరోవైపు ఖరీఫ్ సీజన్ లో తీసుకోవలసిన చర్యలపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజకుమారి తో పాటు… ఇతర శాఖల అధికారులు అంతా పాల్గొన్నారు.

Related posts

న్యూ ట్రెండ్: కొల్లాపూర్ రాజకీయం మారుద్దాం రండి

Satyam NEWS

బంపర్ ఆఫర్: ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్?

Satyam NEWS

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

Satyam NEWS

Leave a Comment