34.2 C
Hyderabad
April 23, 2024 11: 54 AM
Slider ఆదిలాబాద్

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌

#indrakaranreddy

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం నిర్ణీత  సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల నిర్మాణం, వివిధ అభివృద్ధి ప‌నులపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. 

ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, అట‌వీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, (పీసీసీఎఫ్) ఆర్. శోభ, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్ ఎమ్మెల్యేలు, ద‌యాక‌ర్ రావు,  రేఖా శ్యాంనాయ‌క్, రాథోడ్ బాపురావు, ఆత్రం స‌క్కు, దుర్గం చిన్న‌య్య‌, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్,  ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్, నీటి పారుద‌ల శాఖ అధికారులు పాల్గొన్నారు. వీడియో క‌న్ఫ‌రెన్స్ ద్వారా నాలుగు జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్లు, క‌వ్వాల్ ఫీల్డ్ డైరెక్ట‌ర్ వినోద్ కుమార్ ఆదిలాబాద్ సీఎఫ్,  డీఎఫ్ వోలు, ఎఫ్ డీవోలు, ఇత‌ర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రహదారుల నిర్మాణానికి సంబంధించి   యుటిలిటీ షిఫ్టింగ్,  భూసేకరణ, అటవీ అనుమతులు, వివిధ శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, పెండింగ్ ప‌నులు, తదితర విషయాలపై స‌మ‌గ్ర  చర్చించారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం వ‌ల్ల‌ రోడ్ల నిర్మాణ ప‌నుల‌ల్లో ఆల‌స్యం జ‌ర‌గుతుంద‌ని, ప్ర‌తిపాద‌న‌లు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎక్క‌డ పెండింగ్ ఉన్నాయో తెలి అనే వివరాలు కూడా  తెలియ‌డం లేద‌న్నారు. చిన్న చిన్న పొర‌పాట్ల వ‌ల్ల గిరిజ‌న ప్రాంతాల్లోరోడ్ల నిర్మాణ ఆల‌స్యమ‌వుతుంద‌ని తెలిపారు. రోడ్ల నిర్మాణం, అట‌వీ ప్రాంత గ్రామాల్లో కుంట‌ల నిర్మాణం, అట‌వీ అనుమ‌తులు, పెండింగ్ లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు వివ‌రించారు.

మంత్రి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాల‌ని సూచించారు.   క్షేత్ర‌స్థాయిలో త్వ‌రిత‌గ‌తిన స‌మ‌స్య‌లు ప‌రిష్కారించాల‌ని ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి స‌రియైన రూపంలో ప్ర‌తిపాద‌న‌లు పంపిస్తే స‌మ‌యం వృదా కాద‌న్నారు. ఆయా శాఖ‌ల నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించి, జాబితా రూపొందించి, ఉన్న‌తాధికారుల‌కు స‌మ‌ర్పించాల‌న్నారు.

గిరిజ‌న ప్రాంతాల్లో. వాగులు, వంకలు పొంగితే ఎన్నో పల్లెల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయ‌ని,  అనారోగ్యాలకు గురైతే  అంబులెన్స్ లు రాకపోవ‌డంతో తీవ్ర  మారుమూల గ్రామాల‌ ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నార‌ని పేర్కొన్నారు. ప‌రిస్థితులను బ‌ట్టి త‌మ‌ విచ‌క్ష‌ణ మేర‌కు అధికారులు మాన‌వ‌తా దృక్ప‌థంలో వ్య‌వ‌హ‌రించాల‌ని, పాజిటివ్ దృక్ప‌ధం క‌లిగి ఉండాలని హిత‌వు ప‌లికారు. ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు ఉంది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాడానికే అని గ్ర‌హించాల‌న్నారు.

ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మాట్లాడుతూ వెనుక‌బ‌డ్డ  పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి ప‌నులు  త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా అధికారులు చొర‌వ చూపాల‌న్నారు.  నిబంధ‌న‌లు పాటిస్తూనే ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స‌హాక‌రించి ప్ర‌జల‌కు ఇబ్బందులు లేకుడా చూడాల‌ని సూచించారు. బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి ప్ర‌జ‌ల్లో అధికారుల ప‌ట్ల ఉన్న  అపోహల‌ను తొల‌గించుకోవాల‌న్నారు.

Related posts

(Free|Trial) Fruit And Plant Weight Loss Pills Side Effects

Bhavani

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల సాత్తుమొర

Satyam NEWS

వరిపంట చేతికి వచ్చే దశలో రైతాంగం మరింత జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment